• Tithi - Aug, 09 2022

  09.08.2022 మంగళవారం స్వస్తి శ్రీ శుభకృత నామా సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం
  తిథి : ద్వాదశి: మ 02.54 వరకు
  నక్షత్రం : మూల: ఉ 10.22 వరకు
  వర్జ్యం : ఉ 08. 52 - 10.22 వరకు
  దుర్ముహూర్తం : ఉ 08.16 –09.07, రా 10.57-11.42 వరకు
  రాహుకాలం : మ 03.00 – 04.30వరకు

 • Good Word of the Day

  కలియుగానికి కృష్ణుడు చెప్పిన జీవితపాఠం!

   

  శారీరకంగా ఉండే బాధలు ఒకరకమైతే మానసికంగా కలిగే బాధలు మరొక రకం. అందులో భయం చాలా భయంకరమైనది. అందుకే మానవునికి మొదటి శత్రువు భయము అంటారు. కొంత మంది అన్నిటికీ భయపడుతుంటారు. లేనిపోనివి ఊహించుకొని భయంతో వణికి పోతుంటారు. ఈ భయం ప్రాపంచిక విషయములలోనే కాదు దేవుని విషయంలో కూడా ఉంటుంది. ఆ దేవుడికి పూలు పెట్టాము ఈ దేవుడికి పెట్టకపోతే ఆయనకు కోపం వస్తుందేమో. ఈయనకు హారతి ఇచ్చాము ఆయనకు ఇవ్వకపోతే ఎలాగా! ఈ గుడికి వెళ్లాము ఆ గుడికి వెళ్లకపోతే ఏమౌతుందో ఏమో! ఏం చేస్తే ఏ దేవుడికి ఏం కోపం వస్తుందో అని అనునిత్యం భయపడుతుంటారు కొందరు. ఏ పని చేస్తే ఏమౌతుందో అని భయంతో హడలిపోతుంటాడు. 

  ఇవన్నీ అనవసర భయాలు, పరమాత్మకు కోపతాపాలు, ఇష్టాఇష్టాలు ఉండవు అని తెలుసుకోవడమే జ్ఞానము. ఆ జ్ఞానం కలిగిననాడు పరమాత్మ అంటే భయం ఉండదు. అందుకే ఇతరుల వల్ల ఎవడైతే భయం లేకుండా ఉంటాడో, వాడే నా భక్తుడు అని అన్నాడు పరమాత్మ. అంటే ఈ దుర్గుణము అయిన భయాన్ని ముందు వదిలిపెట్టాలి అని అర్థం.

  మనం అన్యాయము, అక్రమము, అధర్మం గా ప్రవర్తించనపుడు ఎవరికీ భయపడనవసరం లేదు అనే నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. అలాగే ఎవరినీ మనం భయానికి లోను చేయకూడదు. ఎవరినీ భయపెట్టకూడదు. తన వాక్కుతో గానీ, శరీరంతో గానీ ఇతరులను భయందోళనలకు గురి చేయకూడదు. శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఇతరులను అకారణంగా హింసించకూడదు. అందరి మీదా అనవసరమైన అధికారం చలాయించకూడదు. అందరూ నాకు భయపడుతూ ఉండాలి. అందరూ నాకు లోబడి ఉండాలి. అందరూ నా చెప్పుచేతల్లో ఉండాలి అనే భావనతో ఉండకూడదు. ఒకవేళ అటువంటి భావనలు ఉంటే, వాటిని మనసులో నుండి తుడిచివెయ్యాలి. కాబట్టి మనం ఒకరికి భయపడకూడదు, మనం మరొకరిని భయపెట్టకూడదు.

  సంతోషము, దుఃఖము, కోపము, భయము, ఉద్వేగము ఇవి మనసు లక్షణాలు. ఇవి మనలో ఒక్కోసమయంలో ఒక్కోవిధంగా విజృంభిస్తుంటాయి. వాటిని అదుపులో పెట్టుకోవాలి. క్రమక్రమంగా వాటికి స్పందించడం మానుకోవాలి. సంతోషం ఎక్కువయినా, దుఃఖము ఎక్కువయినా కష్టమే, ఆ సమయంలో మనలో ఉన్న విచక్షణా శక్తి పని చేయదు. ఆనందం అవధులు దాటినా, దు:ఖము ముంచుకొచ్చినా ఒక్కోసారి గుండె ఆగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అటువంటి భావోద్వేగాలు కలిగినపుడు ఎలాంటి స్పందన లేకకుండా సమభావనతో ఉండటం అలవాటు చేసుకోవాలి. అటువంటి వాడే నాకు ఇష్టమైన వాడు అని అంటున్నాడు. పరమాత్మ.

  కొంత మంది మనలను ఎదురుగా పొగుడుతుంటారు. పక్కనే తిడుతుంటారు. కొంత మంది వాళ్ల కార్యాలు సాధించుకోడానికి పొగుడుతుంటారు. మరి కొంత మంది ఒకరోజు పొగుడుతారు మర్నాడే తిడతారు. ఈ సంవత్సరం లాభం వస్తుంది. మరు సంవత్సరం నష్టం వస్తుంది. ఏకాలానికి తగ్గట్టుగా ఆయాజబ్బులు వస్తుంటాయి. ఇవి అన్నీ చిరునవ్వుతో ఓపికగా భరించాలి. అలాగే అసూయ. ఇది ఇంకా భయంకరమైన జబ్బు. ఎదుటి వాటి ఉన్నతిని ఓర్వలేకపోవడం. అసూయ పడటం. ద్వేషం పెంచుకోవడం. ఇది ఘోరమైన పతనానికి దారి తీస్తుంది. ఎవడినీ క్షణం సేపు ప్రశాంతంగా ఉండనివ్వదు. మనసును అల్లకల్లోలం చేస్తుంది. దీనినే అమర్షణ అని కూడా అంటారు. ఈ అసూయాద్వేషాలను కూడా ప్రతి వాడూ సమూలంగా నాశనం చేయాలి. సాటి వారిని ప్రేమించడం, ఆదరించడం, ఎదుటి వారిలో ఉన్న గొప్పతనాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. కలియుగంలో ఉన్న మానవులకు పరమాత్మ చెప్పే జీవితపాఠం.

  ◆వెంకటేష్ పువ్వాడ.

 • Aug, 2022 Important Days

  01. నాగుల చవితి
  05. వరలక్ష్మీ వ్రతం
  08. పుత్రద ఏకాదశి
  09. మొహరం
  10. వరహ జయంతి
  12. రాఖి పౌర్ణిమ
  15. స్వాతంత్ర దినోత్సం
  17. మఖ కార్తె
  19. శ్రీకృష్ణామి
  22. అజ ఏకాదశి
  25. మాసశివరాత్రి
  27. పోలాల అమావాస్య
  30. బలరామ జయంతి
  31. వినాయక చవితి, పుబ్బ కార్తె

Latest Articles

​సభలో అందరూ మాట్లాడుతున్నప్పుడు విభీషణుడు లేచి  "మీ అందరికీ రాముడంటే చాలా తేలికగా ఉంది. సీతమ్మ అంటే మీకు చాలా చులకనగా ఉంది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. కుంభకర్ణుడు కాని, ఇంద్రజిత్ కాని, రావణాసురుడు కాని, మహాపార్షుడు కాని, మహోదరుడు కాని, నికుంభుడు కాని, వీరెవ్వరు కూడా రాముడి జోలికి వెళ్ళలేరు" అన్నాడు...

 More

​ఆంగ్ల తత్త్వవేత్తలలో పాల్ బ్రింటన్ ఒకరు. ఈయన తన జీవితకాలంలో యోగులు సన్యాసులను కలుస్తూ పలు ఆధ్యాత్మిక, తాత్త్విక విషయాలను తెలుసుకుంటూ ఉండేవారు. ఆయన అరుణాచాలంలో శ్రీ రమణ మహర్షిని కలిసినప్పుడు "నేను" అనే మాట గురించి జరిగిన సంఘటన ఆయనే స్వయంగా ఇలా చెప్పారు.

 More

Videos

 • Enduku - Emiti

  ​\పరబ్రహ్మమూ అతి సూక్ష్మము అంటే పరమాణుస్వరూపము. మామూలు కంటికి కనపడదు. అలాగే ఈ శరీరం కూడా స్థూల శరీరము, సూక్ష్మశరీరము అని రెండుగా ఉంటాయి. జాగ్రదావస్థలో స్థూల శరీరము, స్వప్పావస్థలో సూక్ష్మశరీరము ప్రవర్తిస్తుంటాయి. ఈ సూక్ష్మశరీరము నుండి వాసనలను పూర్తిగా నాశనం చేస్తే అదే పరమాత్మ అవుతుంది. దీనిని అనుభవించవలసినదే కాని కనపడదు. ఈ రెండింటిలోనూ పరబ్రహ్మ స్వరూపము నిక్షిప్తమై ఉంది.

   More

  ​ధ్యానం గురించి చాలమంది చెబుతారు. అయితే కొందరుంటారు కృత్రిమ జీవితం నుండి, ముఖ్యంగా ఇప్పటి రద్దీ పనుల నుండి సాంత్వన కావాలని కోరుకునేవాళ్ళుంటారు. వాళ్ళు మొట్టమొదటగా  అడిగే ప్రశ్న “ధ్యానం ఎంతసేపు చెయ్యాలి?” అని. “భోజనం ఎంత చెయ్యాలి?” అని ఎవ్వరైనా అడిగితే...

   More
 • Vaastu

  ఇంట్లో గొడవలతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..

   More

  ఏయే దిక్కుల్లో ఏమి ఉంటే ఐశ్వర్యం...

   More
 • Aacharaalu

  ​మనిషి తన జీవితంలో చివరగా పొందేది పరమ గతి. పరమాత్ముడి ఆశ్రయాన్ని అంటే పరమాత్మ దగ్గరకు చేరుకోవడం, ఆయనలో లీనమవ్వడం. దీన్నే మోక్షం అని కూడా అంటారు... 

   More

  ఈ సంసారము అనే వృక్షము గురించి తెలుసుకోవడంలో గొప్పేముంది అనుకుంటే పొరపాటే, అంటే ఈ సంసారవృక్షం గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు. ఈ సంసార వృక్షము యొక్క ఆది అంతములు ఎవరికీ తెలియవు. ఎందుకంటే ఈ సంసారవృక్షం ఈ నాటిది. కాదు. దీని ఆది తెలియదు అంతము తెలియదు. మధ్యలో ఏముందో అసలే తెలియదు. పోనీ దీనికి ఒక రూపం ఉందా అంటే అదీ లేదు. కాని ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సంసారము ఈ విధంగా ఉంటుంది అని ఎవరూ నిర్వచించలేరు. ఎందుకంటే దాని స్వరూపము ఇలా ఉంటుంది అని ఎవరూ ఊహించలేరు.

   More

​సభలో అందరూ మాట్లాడుతున్నప్పుడు విభీషణుడు లేచి  "మీ అందరికీ రాముడంటే చాలా తేలికగా ఉంది. సీతమ్మ అంటే మీకు చాలా చులకనగా ఉంది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. కుంభకర్ణుడు కాని, ఇంద్రజిత్ కాని, రావణాసురుడు కాని, మహాపార్షుడు కాని, మహోదరుడు కాని, నికుంభుడు కాని, వీరెవ్వరు కూడా రాముడి జోలికి వెళ్ళలేరు" అన్నాడు...

 More

​రావణుడు విభీషణుడిని తిట్టగానే విభీషణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విభీషణుడు వెళ్లిపోయిన తరువాత  రావణుడు ఒక గొప్ప రధం ఎక్కి అందరినీ సభా మండపానికి రమ్మన్నాడు. అందరూ సభలో కూర్చున్నాక  "నేను సీతని అపహరించి తీసుకొని వచ్చిన మాట పరమ వాస్తవం. ఆ సమయంలో కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కనుక నేను వాడికి చెప్పలేదు. ప్రహస్త! వెళ్ళి కుంభకర్ణుడిని తీసుకురా" అన్నాడు... 

 More

మల్లన్న దేవాలయంలో ఈ దేవాలయాలు దర్శిస్తేనే యాత్రా ఫలితం లభిస్తుంది

 More

వినాయక చవితికి వినాయకుడికి చక్కగా పూజ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కదా?   మరి ఈ సందర్భంగా ఒక విశేష వినాయక ఆలయాన్ని గురించి చెప్పనా? ఈ మధ్య వినాయక చవితి ఉత్సవాల్లో...

 More

​ఐదు మహాభూతములు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము), అహంకారము, బుద్ధి, మూలప్రకృతి, పది ఇంద్రియములు, మనస్సు, ఐదు తన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రస, రూప, గంధము), కోరికలు, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, అందులో ఉన్న చేతనా శక్తి, ధైర్యము, ఇవన్నీ కలిస్తే దానిని క్షేత్రము అని అంటారు.

 More

​హిందూ పురాణాలలో విష్ణుమూర్తికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. విష్ణుమూర్తికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి. వాటినే కేశవనామాలు అని అంటారు. అయితే విష్ణు సహస్ర నామాల్లా, లలితా సహస్రనామాల్లా ఈ కేశవనామాలు పెద్దగా లేకుండా కేవలం ఇరవై నాలుగు మాత్రమే ఎందుకు ఉన్నాయి?? కాలచక్రంలో రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా!! ఈ కాలచక్రానికి, అన్నింటిలోనూ ఒక భాగంగా ఉండే గణితానికి ఏదైనా సంబంధం ఉందా??.

 More