Home

»

Latest News

తెలుగులో చేసింది ఒక్క సినిమానే: విడుదలకు ముందే సెన్సేషన్: కుర్రాళ్లని ఆగం చేస్తున్న హీరోయిన్!

Nov 11, 2026 10:09AM


మీరు పక్క ఫొటోలో చూస్తుంది జస్ట్ పిక్ మాత్రమే కాదు. అభిమానులు, కుర్రకారు గుండెల్లో ప్రేమ అనే లావాని నింపి పడేస్తున్న క్రేజీ హీరోయిన్. పైగా ఒకే ఒక్క సినిమాతోనే ఆ చెప్పలేనంత అభిమానాన్ని సంపాదించింది. కానీ ఒకప్పుడు అందంగా లేదని అందరూ హేళన చేసేవారు. తన లుక్స్, డ్రెస్సింగ్ గురించి ఎగతాళిగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

 కోలీవుడ్ బ్యూటీ దివ్యభారతి.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాలేజీ రోజుల్లో అత్యంత సాధారణంగా, డీగ్లామరస్‌గా కనిపిస్తూ అమాయకంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు గ్లామర్ వరల్డ్‌లో క్యూట్ అండ్ హాట్ లుక్స్‌తో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది.

తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన దివ్యభారతి, జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘బ్యాచిలర్’ సినిమాతో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ చిత్రంలో ‘సుబ్బలక్ష్మి’ క్యారక్టర్ లో  ఒదిగిపోయి తొలి మూవీతోనే  మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని బోల్డ్ సన్నివేశాలలోనూ నటించి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో  ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతమైంది.

తొలి సినిమా సక్సెస్ తర్వాత వెబ్‌సిరీస్‌లు, తమిళంలో పలు చిత్రాలు చేసిన దివ్యభారతి, ప్రస్తుతం టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతోంది. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘G.O.A.T’ (Greatest Of All Time) చిత్రంలో  హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. నవంబర్ 12 రిలీజ్ డేట్. అందుకే అంటారు సినిమా ఎప్పుడు ఎవర్ని అగ్ర ప్రధాన నిలబడతుందో ఊహకి కూడా అందని విషయమని.

ఇది కూడా చదవండి:దాదా ధమాకా: డేట్ ఇదే.. ఫ్యాన్స్ లో పూనకాలు!  

G.O.A.T’ విషయానికి వస్తే గ్రామీణ నేపథ్యంలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమా ద్వారా తన ఇమేజ్ ఫీవర్ ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు :ప్రియా భవాని శంకర్ కళ్యాణం: పెళ్లి కొడుకు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
మీకు నచ్చవచ్చు :హీరోలు vs పోలీసులు: అసలేం జరుగుతుంది!

 

[Divya Bharathi in Goat Movie, Divya Bharathi Latest Speech, Sudigali Sudheer, Divya Bharathi, GOAT movie, Sudigali Sudheer first heroine,Telug cinema news, Telugu Cinema, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com