
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ వన్ మాన్ షో 'దాదా' ఫస్ట్ సింగల్ రాకకి ముహూర్తం సిద్దమయ్యింది. దీంతో బాలకృష్ణ ఆస్థాన సంగీతకారుడిగా అభిమానులు, ప్రేక్షకులు పిలుచుకునే థమన్ ఎలాంటి సాంగ్ ఇవ్వబోతున్నాడనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. మరి ఆ డీటెయిల్స్ చూద్దాం.
ఇంకా రెండే రెండు రోజుల్లో అంటే ఈ నెల 13 న మొదటి పాటని 'దాదా ధమాకా' అనే పేరుతో వచ్చే సాంగ్ రీలీజ్ చేస్తునట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ దీపావళి బాణాసంచా సందడి ముగిసినా, థమన్ మాస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ పాటతో రాబోయే వారాల్లోను పండగ వాతావరణం కంటిన్యూగా కొనసాగుతుందని మూవీ టీమ్ హామీ ఇచ్చింది.
ఇక దాదా చాలా స్పెషల్. ఎందుకంటే బాలయ్య హిట్ లిస్ట్ లో వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకుడు. దీంతో సదరు దర్శకుడు ఏ రేంజ్ లో తెరకెక్కించి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు. థమన్ విషయానికి వస్తే గతంలో బాలకృష్ణ, థమన్ కాంబోలో వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల్లోని పాటలు ఏ స్థాయిలో యూట్యూబ్ రికార్డులను తిరగరాశాయో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు రాబోతున్న 'దాదా ధమాకా' ట్రాక్ కూడా థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించడం విశేషం. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన సిగ్నేచర్ మాస్ స్టెప్పులకు బాలయ్య మార్క్ హై-వోల్టేజ్ ఎనర్జీ తోడైతే వెండితెరపై పూనకాలు రావడం ఖాయమని చిత్రబృందం నమ్మకంతో ఉంది. ఈ స్పెషల్ ట్రాక్‌లో బాలకృష్ణ సరసన బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ప్రత్యేక ఆకర్షణగా మెరవనుంది.
ఇది కూడా చదవండి: లెజండ్రీ కెమెరామెన్ మృతి
దాదాలో బాలయ్య పవర్ఫుల్ మరియు స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ అవతారంలో కనిపించనున్నారు. చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ శక్తివంతమైన విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, అరవింద్ ఎస్ కశ్యప్ ఛాయాగ్రహణం, సాయి మాధవ్ బుర్రా పవర్ ఫుల్ సంభాషణలు, మరియు నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామ్-లక్ష్మణ్, రవివర్మ మరియు వి. వెంకట్ ఆధ్వర్యంలో సమకూరిన యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై పెద్ది ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా డిసెంబర్ 24న వరల్డ్ వైడ్ రిలీజ్.
మీకు నచ్చవచ్చు :డియర్ భక్తాస్: హనుమాన్ అంశ ఓటిటి డేట్ ఇదే!
మీకు నచ్చవచ్చు :స్టార్ హీరోయిన్ విడాకులు: రీజన్ ఇదేనా!
[Nbk DADA First single Release, dada First song Release, Balakrishna dada first single, gopichand malineni, balakrishna, nargis fakri,Telug cinema news, Telugu Cinema, Tollywood, Tollywood News]






