TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

ఎందుకా పరుగులు.. దెబ్బలు తగులుతాయి.. పపరాజీలకు వైభవ్ సూర్యవంశీ స్వీట్ అండ్ క్యూట్ వార్నింగ్.!

క్రికెట్ సంచలనం 15 ఏళ్ల బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పాపరాజీలకు వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన స్వీట్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఆసియా క్రీడలలో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారుల అభినందన సభలో పాల్గొనేందుకు వైభవ్ సూర్యవంశీ గురువారం (అక్టోబర్ 15) ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. ఢిల్లీలో అకాల వర్షం కురుస్తున్న సమయంలో ఎయిర్‌పోర్ట్ వెలుపల వైభవ్ సూర్యవంశీ వీడియోలు, ఫోటోలు తీసేందుకు పాపరాజీలు ఎగబడ్డారు. కెమెరాలతో తన వెనుక పరుగులు తీస్తున్న వారిని చూసి వైభవ్ సూర్యవంశీ స్పందించారు. రీల్స్ కోసం అలా వెంట పడకండి బ్రో.. అనవసరంగా దెబ్బలు తగులుతాయి అంూ సామాజిక మాధ్యమం వేదికగా హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ కామెంట్లకు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. వైభవ్ సూర్యవంశీ నవ్వులు, ఆయన మాట్లాడిన తీరును తెగ పొగిడేస్తున్నారు. మరోవైపు, వెస్టిండీస్‌తో అక్టోబర్ 17, 2026 శనివారం రోజున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో ఆడే అవకాశాలు దాదాపు మృగ్యమే. టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న సంజు శాంసన్, అభిషేక్ శర్మ రాణిస్తుండటంతో టీమిండియా మేనేజ్‌మెంట్ వారిపైనే నమ్మకం ఉంచింది. దీంతో స్వదేశీ గడ్డపై ఇంకా భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయని సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో కూడా బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశాలే మెండు. వైభవ్ సూర్యవంశీ అవకాశాల కోసం మరి కొంత కాలం వేచి చూడక తప్పదని ఇప్పటికే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విస్పష్టంగా చెప్పారు. [Vaibhav Sooryavanshi Sweet warning paparazzi, Team India, Viral Video, T20 Series, Windies, Telugu One]

Published on: Fri Oct 16, 2026 12:13PM

political-news-img

టీమిండియాకు బౌలింగ్ కష్టాలు.. విండీస్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన!

సొంత గడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలకమైన టి20 సిరీస్‌లో టీమిండియా పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ మరియు ఫీల్డింగ్ వైఫల్యాలు భారత జట్టు వరుస ఓటములకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. రాంచితో పాటు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లోనూ బౌలింగ్ లోపాలు జట్టును తీవ్రంగా వెంటాడాయి. రాంచిలో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 250 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోవడంలో మన బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. అలాగే ఉప్పల్‌లో జరిగిన నాల్గో టి20 మ్యాచ్‌లోనూ బౌలర్లు కంట్రోల్ కోల్పోయి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ రెండు కీలక మ్యాచులలోనూ టీమిండియాకు ఘోర పరాజయాలు తప్పలేదు. అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్, నమన్ ధిర్, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులందరూ ఈ సిరీస్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చి ఒత్తిడికి లోనయ్యారు. కొంతకాలంగా టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న ఈ బౌలింగ్ సమస్యకు తక్షణ పరిష్కారం దొరకడం లేదు. బుమ్రా, సిరాజ్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు మినహా మిగిలిన ప్రధాన పేసర్లు అంతా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ఒక్కడే కొంతవరకు పర్వాలేదనిపిస్తున్నప్పటికీ, అతన్ని కీలకమైన మ్యాచులలో అనూహ్యంగా జట్టుకు దూరంగా ఉంచుతున్నారు. రవి బిష్ణోయ్ లాంటి ప్రతిభావంతులైన బౌలర్లు కూడా బెంచ్‌కే పరిమితం కావలసి వస్తోంది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఆటగాళ్ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని, దీని ప్రభావం నేరుగా వారి ప్రదర్శనపై స్పష్టంగా కనిపిస్తోందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లతో పోల్చి చూస్తే ప్రస్తుత టీమిండియా బౌలింగ్ లైనప్ చాలా బలహీనంగా తయారైంది. రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌లో ఈ బలహీన బౌలింగ్‌తో విజయాలు సాధించడం అత్యంత కష్టంతో కూడుకున్న అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఫీల్డింగ్ రంగంలోనూ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చేతికొచ్చిన సులువైన క్యాచ్‌లను సైతం నేలపాలు చేస్తూ ప్రత్యర్థి జట్లకు ఊపిరిూదుతున్నారు. విండీస్ సిరీస్‌లో మన ఫీల్డింగ్ ప్రమాణాలు పూర్తిగా తీసికట్టుగా మారి, ప్రత్యర్థి బ్యాటర్లకు వరంగా మారుతున్నాయి. ఇప్పటికైనా మేనేజ్‌మెంట్ స్పందించి బౌలింగ్ మరియు ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. [India vs West Indies T20 Series, Team India Bowling Problems, Indian Cricket Team, Gautam Gambhir, Jasprit Bumrah, Mohammed Siraj, Arshdeep Singh, Kuldeep Yadav, Ravi Bishnoi, India Fielding Failures]

Published on: Fri Oct 16, 2026 10:20AM

political-news-img

బీసీసీఐ మాస్టర్ ప్లాన్: వన్డేలకు రెస్ట్ ఇచ్చి కేవలం టెస్టులకే బుమ్రా పరిమితం?

భారత క్రికెట్ జట్టు ప్రధాన పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా అభిమానులకు బీసీసీఐ మరియు టీమిండియా మేనేజ్‌మెంట్ ఒక కీలకమైన అప్‌డేట్‌ను అందించింది. రాబోయే న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేకపోయినా, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ బుమ్రాను న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి తప్పించాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘ కాలం పాటు టీమిండియాను విజయాల పథంలో నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తున్న బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ఆటగాళ్ల శారీరక దృఢత్వాన్ని కాపాడుతూ, అత్యంత కీలకమైన టెస్ట్ సిరీస్‌ల కోసం వారిని సన్నద్ధం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్‌లు, అలాగే ఆస్ట్రేలియాతో తలపడనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లాంటి సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వన్డే ద్వైపాక్షిక సిరీస్‌ల కంటే రెడ్-బాల్ క్రికెట్‌లో బుమ్రా సేవలు టీమిండియాకు అత్యంత ఆవశ్యకమని మేనేజ్‌మెంట్ గట్టిగా విశ్వసిస్తోంది. అందువల్ల అతనికి అనవసరమైన పనిభారాన్ని తగ్గించి, పూర్తి స్థాయిలో విశ్రాంతి కల్పించాలని నిర్ణయించారు. ఈ ప్రణాళికలో భాగంగా, నవంబర్ 6న ప్రారంభంకానున్న మూడో ఇండియా 'ఏ' మ్యాచ్‌లో బుమ్రా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ మ్యాచ్ ద్వారా కొంత ప్రాక్టీస్ పొందిన తర్వాత, నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్ వేదికగా ప్రారంభంకాయే తొలి టెస్ట్ మ్యాచ్‌తో అతడు నేరుగా రెడ్-బాల్ జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ పకడ్బందీ వ్యూహం వల్ల బుమ్రా ఎలాంటి అలసట లేకుండా నేరుగా టెస్ట్ పోరుకు సిద్ధం కాగలుగుతాడని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఏదేమైనప్పటికీ, వైట్-బాల్ క్రికెట్‌లో కివీస్‌తో జరిగే పోరులో ప్రపంచ స్థాయి పేసర్ సేవలను కోల్పోవడం అభిమానులకు కొద్దిగా నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. [Jasprit Bumrah, India vs New Zealand Series, BCCI, Team India, Jasprit Bumrah Workload Management, India New Zealand ODI Series, Border Gavaskar Trophy, India Test Cricket, New Zealand Tour of India, Indian Cricket News]

Published on: Fri Oct 16, 2026 10:06AM

political-news-img

కోహ్లీ వ్యాపార సామ్రాజ్యం.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వెల్కమ్!

భారత క్రికెట్ రంగానికి చెందిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన లింక్డిన్‌లోకి అడుగుపెట్టారు. క్రికెట్ మైదానంలో తన అసాధారణ ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కోహ్లీ, ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. లింక్డిన్‌లో ఆయన చేసిన తొలి పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో అడుగుపెట్టిన కేవలం 24 గంటల్లోనే ఆయన ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 2,40,000 దాటిపోవడం విశేషం. ఈ అద్భుతమైన స్పందన ఆయన గ్లోబల్ పాపులారిటీ ఏంటో మరోసారి నిరూపించింది. 37 ఏళ్ల వయస్సు గల విరాట్ కోహ్లీ తన తొలి లింక్డిన్ పోస్ట్‌లో కేవలం వ్యక్తిగత విషయాల గురించే కాకుండా, భారతదేశంలో క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై తన స్పష్టమైన దార్శనికతను పంచుకున్నారు. మన దేశం నుంచి ప్రపంచ స్థాయి అథ్లెట్లను తయారు చేయడం మాత్రమే కాకుండా, గ్లోబల్ మార్కెట్ కోసం సరికొత్త బ్రాండ్లను నిర్మించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అథ్లెట్లు, పోటీలకే పరిమితం కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్, కన్జూమర్ బ్రాండ్లు, స్పోర్ట్స్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన సంపూర్ణ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌ను భారత్‌లో అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. అందరినీ మించి శాశ్వతంగా నిలిచే ఒక గొప్ప వ్యవస్థను నిర్మించే ప్రయాణంలో తాము ఉన్నామని కోహ్లీ స్పష్టం చేశారు. ఈ వ్యాపార ప్రయాణంలో భాగంగా తాను స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన 'అగిలిటాస్' (Agilitas)లో ఇన్వెస్టర్‌గా చేరానని, అలాగే 'వన్-ఎయిట్ వరల్డ్' (one8world) సంస్థకు కో-ఫౌండర్ మరియు కో-క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నట్లు కోహ్లీ వెల్లడించారు. సరిహద్దులను చెరిపేయడం, ప్రమాణాలను పెంచడం, విభిన్నమైన మార్గాన్ని ఎంచుకోవడం అనే తత్వంతోనే 'వన్-ఎయిట్' బ్రాండ్ రూపుదిద్దుకుందని ఆయన గుర్తుచేసుకున్నారు. తన సొంత నగరంలో వేలాది మంది అభిమానుల సమక్షంలో వన్-ఎయిట్ వరల్డ్ ఆవిష్కృతం కావడం తన జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఒకటని తెలిపారు. విరాట్ కోహ్లీ లింక్డిన్ ఎంట్రీపై మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ మరియు సీఈఓ సత్య నాదెళ్ల ప్రత్యేకంగా స్పందించారు. కోహ్లీ తొలి పోస్ట్‌పై స్పందిస్తూ, "నా ఫీడ్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. లింక్డిన్‌లోకి స్వాగతం విరాట్! అలాగే 'వన్-ఎయిట్ వరల్డ్'తో మీ కొత్త అధ్యాయానికి హృదయపూర్వక అభినందనలు" అంటూ ఆప్యాయంగా వెల్కమ్ చెప్పారు. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని ఈ ప్రొఫెషనల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ చేరడం పట్ల టెక్, స్పోర్ట్స్ వర్గాల్లోనూ తీవ్ర ఉత్సాహం నెలకొంది. క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, 2008లో సీనియర్ ఇండియా జట్టు తరఫున అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 123 టెస్టులు, 317 వన్డేలు, 125 టీ20లు ఆడి మొత్తం 28,257 అంతర్జాతీయ పరుగులు సాధించారు. టెస్ట్ మరియు టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ, ప్రస్తుతం తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ యువ వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. భారతీయ క్రీడా రంగానికి గ్లోబల్ గుర్తింపు తెచ్చే ఈ మహా యజ్ఞంలో ఆయన అడుగులు దేశ యువతకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. [Virat Kohli LinkedIn, Virat Kohli Business Ventures, one8world, Agilitas Sports, Satya Nadella, Microsoft CEO, Virat Kohli Followers, Indian Sports Industry, Virat Kohli International Records, Sports Entrepreneurship India]

Published on: Thu Oct 15, 2026 6:17PM

political-news-img

బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్షన్ కమిటీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో, బీసీసీఐ తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను నియమించింది. భారత జట్టు తరఫున 24 టెస్టులు ఆడిన అనుభవం ఉన్న ప్రజ్ఞాన్ ఓజాకు ప్రస్తుతం సెలెక్షన్ కమిటీ సమావేశాలు మరియు కార్యకలాపాలను నిర్వహించే కీలక బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుత సెలెక్షన్ కమిటీలోని సభ్యులతో పోలిస్తే ఓజా అత్యధికంగా 24 టెస్టు మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ఉండటంతో, ఆయనకు ఈ తాత్కాలిక బాధ్యతలు దక్కాయి. అంతేకాకుండా, ఈ పదవికి సంబంధించి శాశ్వత చీఫ్ సెలెక్టర్ రేసులో కూడా ఆయన పేరు బలంగా వినిపిస్తుండటం విశేషం. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం, ప్రజ్ఞాన్ ఓజా అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా కనిపిస్తున్నప్పటికీ, ఫుల్-టైమ్ నియామకంపై బోర్డు నుండి తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. మరోవైపు, ఈ రేసులో మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ పేరు కూడా గతంలో చర్చకు వచ్చినప్పటికీ, నిర్ణీత గడువులోగా ఆయన దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ప్రజ్ఞాన్ ఓజా సారథ్యంలోని కమిటీ ముందు అత్యంత కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు, భారత జట్టు తలపడబోయే పలు అంతర్జాతీయ సిరీస్‌ల కోసం జట్లను ఎంపిక చేయడంలో ఈ కమిటీ కీలకపాత్ర పోషించనుంది. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లను గుర్తించడం, బెంచ్ బలాన్ని పటిష్టం చేయడం మరియు దేశీయ క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్లపై కన్నేయడం వంటి పెద్ద సవాళ్లు కొత్త సెలెక్టర్ల ముందు ఉన్నాయి. అంతేకాకుండా, సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు, ఆల్ రౌండర్లు మరియు పేస్ బౌలర్ల ఎంపికపై కూడా ఈ కమిటీ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 7 టెస్టులు, లేదా 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, లేదా 10 వన్డేలతో పాటు 20 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అలాగే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని కనీసం ఐదేళ్లు పూర్తై ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ప్రజ్ఞాన్ ఓజా శాశ్వత చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికవుతారా లేదా బీసీసీఐ మరే ఇతర పేరును పరిశీలిస్తుందనే ఉత్కంఠ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్రంగా నెలకొంది. [BCCI, Pragyan Ojha, Ajit Agarkar, BCCI Chief Selector, Indian Cricket Team Selection, Parthiv Patel, India vs New Zealand Series, ICC Cricket World Cup 2027, BCCI Selection Committee, Indian Cricket News]

Published on: Thu Oct 15, 2026 9:41AM

political-news-img

ఎస్‌ఆర్‌హెచ్‌లోకి టీ. నటరాజన్ రీఎంట్రీ: రూ. 5.75 కోట్ల భారీ కోత!

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ అభిమానులకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, ‘యార్కర్ కింగ్’ టీ. నటరాజన్ తిరిగి తన హోమ్ టీమ్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి అడుగుపెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన అధికారిక ప్లేయర్ ట్రేడింగ్ ఒప్పందంలో భాగంగా ఈ భారీ మార్పు చోటుచేసుకుంది. 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నటరాజన్‌ను ఏకంగా రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, తాజా ట్రేడింగ్ నిబంధనల ప్రకారం ఆయన ఇప్పుడు సవరించిన రూ. 5 కోట్ల ధరకు తిరిగి ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టుతో చేతులు కలిపాడు. దీనివల్ల నటరాజన్ తన మునుపటి ధరతో పోలిస్తే సుమారు రూ. 5.75 కోట్ల మేర భారీ జీత కోతను (Pay Cut) ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ ఆసక్తికరమైన ప్లేయర్ ట్రేడింగ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన యంగ్ లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బదిలీ అయ్యాడు. జీషన్ అన్సారీ తన ప్రస్తుత రూ. 40 లక్షల ధరతో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనున్నాడు. 2025 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన అన్సారీ, ఇప్పటివరకు మొత్తం 10 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి స్టార్ స్పిన్నర్లు ఉన్న ఢిల్లీ జట్టులో అన్సారీ చేరడం ద్వారా వారి స్పిన్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. మరోవైపు, సన్‌రైజర్స్ జట్టు తమ డెత్ ఓవర్ల బౌలింగ్‌ను పటిష్టం చేసుకునేందుకు అత్యంత అనుభవజ్ఞుడైన భారతీయ పేసర్ నటరాజన్ సేవలను మళ్లీ దక్కించుకోవడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నటరాజన్‌కు సన్‌రైజర్స్ జట్టుతో మంచి అనుబంధం ఉంది. గతంలో 2020 నుంచి 2024 వరకు ఎస్‌ఆర్‌హెచ్ జట్టు తరఫున ఆడిన ఆయన అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆ ఐదు సీజన్లలో మొత్తం 55 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్ 65 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2024 ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణించిన ఆయన, 19 వికెట్లు పడగొట్టి ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆ సీజన్‌లో హైదరాబాద్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లడంలో నట్టూ కీలక భూమిక పోషించాడు. ఆ తర్వాత 2025 వేలంలో ఢిల్లీ జట్టుకు మారిన నటరాజన్, గాయాల కారణంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఢిల్లీ తరఫున గత రెండు సీజన్లలో కేవలం 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మొత్తంగా ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 73 మ్యాచ్‌లు ఆడిన టీ. నటరాజన్ 72 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ తాను అత్యధిక విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులోకి రావడం, భువనేశ్వర్ కుమార్ వంటి దిగ్గజాల సరసన జట్టు పేస్ అటాక్‌ను లీడ్ చేయడానికి సిద్ధమవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రూ. 5.75 కోట్ల భారీ ఆర్థిక నష్టాన్ని పక్కనపెట్టి, తన ఫేవరెట్ ఫ్రాంచైజీ వైపు నటరాజన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2027లో నట్టూ వేసే కచ్చితమైన యార్కర్లు ఎస్‌ఆర్‌హెచ్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తాయో వేచి చూడాలి. [Sunrisers Hyderabad, T Natarajan, IPL 2027, Delhi Capitals, T Natarajan Player Trade, Zeeshan Ansari, IPL Player Trading, SRH Squad Updates, T Natarajan Salary Cut, IPL Cricket News]

Published on: Thu Oct 15, 2026 9:29AM

political-news-img

India vs WI: నాలుగో టీ20లో భారత్ ఓటమికి అదే కారణమా.. శ్రేయస్ అయ్యర్ అసంతృప్తి.!

క్రికెట్ ప్రియులను ఉర్రూతలూగించిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియాకు నిరాశ ఎదురైంది. నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ పరాజయంతో ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్ ప్రస్తుతం 2-2తో సమంగా నిలిచింది. ఇరు జట్ల మధ్య జరగనున్న చివరి మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ అసాధారణ బ్యాటింగ్‌తో అజేయ శతకం బాది ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. కేవలం 50 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న ఆయన, భారత బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ కేవలం 3 వికెట్ల నష్టానికే 247 పరుగుల భారీ లక్ష్యాన్ని బోర్డుపై ఉంచారు. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కూడా గట్టి పోటీనిచ్చింది. అయితే, వెస్టిండీస్ బౌలర్ కీమో పాల్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తూ ఐదు వికెట్లు పడగొట్టడంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఒత్తిడికి గురైంది. చివరి వరకు పోరాడినప్పటికీ, నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి భారత్ 223 పరుగులకే పరిమితమై, 24 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడవలసి వచ్చింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన జట్టు ఓటమిపై స్పష్టతనిచ్చారు. ఈ పరాజయానికి ప్రధాన కారణం పేలవమైన బౌలింగేనని ఆయన నిక్కచ్చిగా తెలిపారు. కీలకమైన సమయంలో బౌలర్లు తమ వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంలో, సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు సంధించడంలో విఫలమయ్యారని అయ్యర్ అభిప్రాయపడ్డారు. అయితే, జట్టు బ్యాటింగ్ శైలిని మాత్రం ఆయన పూర్తిగా సమర్థించారు. 250 పరుగుల వంటి భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటర్లు కనబర్చిన దూకుడు, తెగువ ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లు పిచ్ నుండి లభించిన సహకారాన్ని చక్కగా ఉపయోగించుకున్నారని, క్లిష్టమైన దశలోనూ వారు పుంజుకున్న తీరు అద్భుతమని కితాబిచ్చారు. ఓటమి ఎదురైనప్పటికీ, భారత జట్టు 220 పరుగులకు పైగా సాధించడం తమ దూకుడైన ఆటతీరుకు నిదర్శనమని అయ్యర్ వెల్లడించారు. తాము అనుసరిస్తున్న వ్యూహాలపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. తిలక్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి భారత ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. తిలక్‌ వర్మ దూకుడుగా ఆడుతూ సిక్సర్లతో స్కోరు వేగాన్ని పెంచాడు. 25 బంతుల్లో 45 పరుగులు సాధించి జట్టుకు అండగా నిలిచాడు. అయితే, షెపర్డ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో పావెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మరోవైపు నితీశ్‌ కుమార్‌ రెడ్డి కూడా కీలక సమయంలో వేగంగా పరుగులు సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే 41 పరుగులు చేసి భారత విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే, తిలక్‌ వర్మ తరహాలోనే భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో పావెల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే చివరి ఓవర్లలో పరుగుల వేగాన్ని మరింత పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో భారత బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. భారీ షాట్లు ఆడే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోవడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. శాంసన్‌ దూకుడు, తిలక్‌ వర్మ, నితీశ్‌ రెడ్డి పోరాటం ఉన్నప్పటికీ భారత్‌ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఇషాన్‌ కిషన్‌ త్వరగా ఔటవడం, శ్రేయస్‌ అయ్యర్‌ కీలక సమయంలో వికెట్‌ కోల్పోవడం, మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు పడటం భారత ఛేదనపై తీవ్ర ప్రభావం చూపాయి. మరోవైపు, షాయ్‌ హోప్‌ శతకం, రూథర్‌ఫర్డ్‌ వేగవంతమైన ఇన్నింగ్స్‌ వెస్టిండీస్‌కు భారీ స్కోరు అందించాయి. చివర్లో కీమో పాల్‌ ఐదు వికెట్లతో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. దీంతో పోరాడినప్పటికీ టీమిండియాకు ఓటమి తప్పలేదు. బెంగళూరు వేదికగా జరగనున్న సిరీస్ నిర్ణయాత్మక ఐదవ చివరి మ్యాచ్‌లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తప్పులను సరిదిద్దుకుని, ప్రణాళికల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని, సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని ఆయన ప్రకటించారు. [ India vs West Indies T20, Shreyas Iyer captain, India 4th T20 loss, Shai Hope century, Hyderabad T20 match, Sanju Samson, Tilak Varma, Nitish Kumar Reddy ]

Published on: Thu Oct 15, 2026 8:36AM

political-news-img

ఉప్పల్‌లో విండీస్ సునామీ బ్యాటింగ్: హోప్ సూపర్ సెంచరీ.!

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా కరీబియన్ బ్యాటర్లు తమదైన శైలిలో సునామీ సృష్టించారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారించారు.నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు మూడు వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో పరుగుల ప్రవాహం చూసి క్రీడా ప్రేమికులు ఆశ్చర్యపోయారు. ఈ ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టు తరఫున కెప్టెన్ హోప్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అప్రతిహత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఉతికిపారేశారు. కేవలం 50 బంతులను మాత్రమే ఎదుర్కొన్న హోప్, 9 భారీ సిక్సర్లు, 4 ఫోర్ల సహాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ సెంచరీ ఇన్నింగ్స్ మ్యాచ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కెప్టెన్‌తో పాటు మిగతా బ్యాటర్లు కూడా తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఆండ్రూ (21), హెట్‌మెయిర్ (33), పావెల్ (24) పరుగులతో రాణించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.ముఖ్యంగా చివరి ఓవర్లలో షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ మైదానంలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. కేవలం కొన్ని బంతుల్లోనే 49* పరుగులు చేసి జట్టు స్కోరును తిరుగులేని స్థితికి చేర్చారు. మొత్తంగా విండీస్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఏకంగా 16 సిక్సర్లు బాది అభిమానులను అలరించారు. స్టేడియం నలుమూలలా బంతులు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపించారు.ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడం ప్రత్యర్థి జట్టుకు కత్తి మీద సాములాంటిదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విజయంతో విండీస్ జట్టు సిరీస్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంది. [ West Indies Cricket Team, Uppal Stadium Match, Captain Hope Century, T20 Cricket News, TeluguOne News, BCCI, ICCI ]

Published on: Wed Oct 14, 2026 8:54PM

political-news-img

IND vs WI 4th T20: ఉప్పల్‌లో భారత్‌-వెస్టిండీస్ సమరం.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.!

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య రసవత్తరమైన నాలుగో టీ20 మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. ఈ ఉత్కంఠభరిత పోరును కనులారా వీక్షించేందుకు సుమారు 40,000 మందికి పైగా క్రికెట్ అభిమానులు స్టేడియానికి పోటెత్తనున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే, భారీ జనసందోహం కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ సజావుగా సాగేందుకు మొత్తం 2,200 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ భద్రతా ఏర్పాట్లలో భాగంగా స్టేడియం పరిసరాలను నిరంతరం పర్యవేక్షించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏకంగా 408 సీసీటీవీ కెమెరాలను 2 ప్రత్యేక డ్రోన్లను రంగంలోకి దించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా, మహిళా ప్రేక్షకుల భద్రత కోసం ప్రత్యేకంగా 5 'షీ టీమ్స్' నిరంతరం గస్తీ తిరుగుతుండగా, స్టేడియం లోపల అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టడానికి 4 ప్రత్యేక సివిల్ డ్రెస్ పోలీసు బృందాలను కూడా మోహరించారు. ఆటగాళ్ల భద్రత కోసం ఒక అసిస్టెంట్ కమిషనర్ (ACP) స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక రక్షణ వలయం ఏర్పాటు చేయబడింది. మ్యాచ్ జరిగే సమయంలో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలపై మల్కాజిగిరి పోలీసులు ఆంక్షలు విధించారు. నాగోల్ యూ-టర్న్ (పిల్లర్ నెం. 814), మెహఫిల్ జంక్షన్, హబ్సిగూడ జంక్షన్ రామంతాపూర్ స్ట్రీట్ నెం. 8 వద్ద భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు దారి మళ్లిస్తున్నారు. నాగోల్ నుంచి వచ్చే భారీ వాహనాలను భాగ్యయత్, నల్లచెరువుకట్ట, చెంగిచెర్ల, మల్లాపూర్, నాచారం మీదుగా హబ్సిగూడ, తార్నాక వైపు మళ్లిస్తున్నారు. అలాగే ఘట్‌కేసర్ వైపు వెళ్లే వాహనాలకు కూడా ప్రత్యేక దారి మళ్లింపులను ప్రకటించారు. ప్రేక్షకుల సౌలభ్యం కోసం స్టేడియం చుట్టూ దాదాపు 8,000 వాహనాలు (4,600 ఫోర్-వీలర్లు, 3,400 టూ-వీలర్లు) పార్కింగ్ చేసుకునేలా ప్రత్యేక స్థలాలను గుర్తించారు. వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా అయిన ఆర్టీసి ప్రత్యేక బస్సులు మెట్రో రైళ్లను వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మ్యాచ్ అనంతరం ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలను పొడిగించడంతో పాటు స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ప్రేక్షకులు ఎటువంటి నకిలీ వెబ్‌సైట్లను నమ్మకుండా అధికారిక మార్గాల ద్వారానే టికెట్లు కొనుగోలు చేయాలని, మ్యాచ్‌కు కనీసం గంటల ముందే స్టేడియానికి చేరుకుని పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. [ Uppal Stadium, Ind vs WI 4th T20, Hyderabad Traffic Restrictions, Rajiv Gandhi Stadium, India West Indies Match, Police Security Plan, BCCI, ICCI ]

Published on: Wed Oct 14, 2026 4:19PM

political-news-img

రోహిట్ శర్మపైనే నమ్మకముంచిన ముంబై ఇండియన్స్: మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు.!

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. అయితే గత రెండు సీజన్లలో ఆ జట్టు చతికిల పడింది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ జట్టు కూర్పు, కెప్టెన్ తదితర అంశాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే జట్టు సారథ్య బాధ్యతలను హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ విషయంపైనే జోరుగా చర్చ జరుగుతోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలను భారత స్టార్ బ్యాటర్, టీమ్ ఇండియా మాజీ స్కిప్పర్ రోహిత్ శర్మ చేపట్టనున్నారన్న వార్త క్రికట్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక అధికారిక పోస్ట్ ద్వారా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ స్కిప్పర్ గా మళ్లీ పగ్గాలు అందుకోనున్నాడన్న సంకేతాన్ని ఇచ్చింది. దీంతో రోహిత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ ఇటీవల తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో జట్టులోని ప్రముఖ ఆటగాళ్లను విభిన్నమైన, శక్తివంతమైన బిరుదులతో సంబోధిస్తూ ఒక ఆకర్షణీయమైన ఫొటోను షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను కింగ్ గా, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను లయన్ గా, స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను లైట్నింగ్ గా, యువ ఆటగాడు తిలక్ వర్మను స్టార్ గా పేర్కొంది. ముఖ్యంగా రోహిత్ శర్మకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇచ్చిన ఈ కింగ్ బిరుదే ఇప్పుడు ఆయనకే జట్టు సారథ్య బాధ్యతలన్న సంకేతంగా క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. 2026 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో జట్టు తొమ్మిదో స్థానంలో నిలవడంతో జట్టు నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన గత మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టు రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ముఖ్యంగా 2024లో జట్టు పట్టికలో చివరి స్థానంలో నిలవగా, 2023లో రెండో క్వాలిఫయర్ వరకు మాత్రమే చేరుకోగలిగింది. ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ యాజమాన్యం జట్టు సారథ్య బాధ్యతలు మళ్లీ రోహిత్ కు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కు 2013 నుంచి 2023 వరకు సుదీర్ఘకాలం పాటు ఉన్నారు. నాయకత్వ ప్రతిభతో జట్టును ఏకంగా ఐదు సార్లు (2013, 2015, 2017, 2019, 2020) ఛాంపియన్‌గా నిలబెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి అత్యధికంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన రికార్డు రోహిత్ పేరు మీదనే ఉంది. అదే విధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లోనూ కెప్టెన్ గారోహిత్ శర్మ రికార్డు అమోఘంగా ఉంది. 2021 నుంచి 2025 వరకు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్.. భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. ఆయన సారథ్యంలోనే టీమిండియా 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవడంతో పాటు, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. అలాగే 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను అజేయంగా ఫైనల్‌కు చేర్చడంలో రోహిత్ కీలక పాత్ర పోషించారు. ఇలా విజయాలతో ప్రపంచ క్రికెట్‌లో అగ్రగామిగా నిలిచిన రోహిత్ శర్మ, ఇప్పుడు మళ్లీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపడితే ఆ జోష్ వేరేలా ఉంటుందని అభిమానులు అంటున్నారు. [Rohit Sharma Mumbai Indians Captain Again, IPL 2027, MI Captain, Rohit Sharma Captaincy, Hitman Rohit, Telugu One]

Published on: Wed Oct 14, 2026 10:15AM