Home

»

Latest News

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: అన్నయ్య బరిలోకి దిగబోతున్నాడు..వైరల్ గా మారిన పిక్!

Nov 11, 2026 2:07PM

మెగా అభిమానులకి గుడ్ న్యూస్.. గుడ్ న్యూస్ ఏంటి ఒక రకంగా పండుగే. అసలు ఇప్పుడు చెప్పుకోబోయే మాటర్ ని ముందుగానే తెలుసుకున్న వాళ్ళైతే  సంబరాల్లో కూడా మునిగిపోయారు. మరి ఆ ఆనందకర న్యూస్ చూసేద్దాం.

చిరంజీవి అప్ కమింగ్ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర.. మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో అభిమానుల్లో విశ్వంభర బెంగ మొదలైంది. సినిమా నిర్మాణం ఏ దశలో ఉందనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో నటుడు ప్రవీణ్ కుమార్ తాజాగా డబ్బింగ్ సెషన్‌కి సంబంధించిన ఫొటోని  సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఒక్కసారిగా విశ్వంభర  మరోసారి వార్తల్లో నిలిచింది.ఇది కేవలం ఒక డబ్బింగ్ సెషన్‌కు సంబంధించిన ఫొటో మాత్రమే అయినప్పటికీ.. సినిమా పనులు పూర్తిగా ఆగిపోలేదని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని అభిమానులు భావిస్తున్నారు

.

ఇది కూడా చదవండి: వివాదంలో కమల్ హాసన్ కొత్త మూవీ సండియర్‌

ముఖ్యంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న సినిమాకి  డబ్బింగ్, ఇతర సాంకేతిక పనులు కీలకం. అయితే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ అప్‌డేట్‌ను విడుదలకు సంబంధించిన సంకేతంగా భావించలేం.


‘విశ్వంభర’ఆలస్యానికి ప్రధాన కారణాల్లో భారీ వీఎఫ్‌ఎక్స్ పనులు ఒకటిగా ప్రచారం జరిగింది. సోషియో ఫాంటసీ కథాంశం కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అనుకున్న సమయానికి రిలీజ్  చేయలేకపోయారు.

ఏది ఏమైనా ప్రవీణ్ చేసిన పిక్ అభిమానుల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. అభిమానం అనేది అంత కల్మషం లేనిది మరి. విశ్వంభరని యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది.

 

మీకు నచ్చవచ్చు:రామాయణకి ఆస్కార్ వస్తుందా? రాదా? 
మీకు నచ్చవచ్చు:ప్రముఖ కెమరామెన్ మృతి!

 

[Chiranjeevi Vishwambhara Bubbing Update, Chiranjeevi Vishwambhara, Vishwambhara movie update, Vishwambhara release date, Vassishta Mallidi, Telugucinema news, TeluguCinema, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com