Home

»

Latest News

సమంత డెలివరీ అయిపోయిందని నమ్మిన బామ్మ.. నటి సమాధానం వింటే నవ్వాల్సిందే.!

Nov 11, 2026 2:17PM

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆమె బేబీ బంప్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి ‘మేటర్నిటీ ఫొటోషూట్‌గా భావించండి’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా సమంతకు కవల పిల్లలు పుట్టారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన ఓ బామ్మ నిజంగానే సమంతకు డెలివరీ అయిపోయిందని నమ్మేసింది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. సమంతకు ఇద్దరు పిల్లలు పుట్టారని, ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వచ్చేసిందని ఓ బామ్మ తన మనవడితో చెబుతుంది. అయితే ఆమె చెప్పే విషయాలన్నీ నిజం కావు. కొందరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సమంతకు కవల పిల్లలు పుట్టినట్లు నకిలీ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. వాటిని చూసిన ఆ బామ్మ నిజమేనని భావించి తన మనవడితో వాదించింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చివరికి సమంత దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆ వీడియో చూసిన ఆమె సరదాగా స్పందించారు. ‘ఇంకా లేదు అమ్మమ్మ’ అంటూ కామెంట్ చేశారు. అంటే తనకు ఇంకా పిల్లలు పుట్టలేదని, ఆ వీడియోలో ఉన్న సమాచారం నిజం కాదని ఆమె ఒక్క మాటతో స్పష్టం చేశారు. సమంత ఇచ్చిన ఈ సమాధానం ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇటీవల సమంత తన బేబీ బంప్ ఫొటోను షేర్ చేయడంతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలో తన దినచర్యకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. వ్యాయామం చేస్తున్న వీడియోలు, తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సరదాగా గడుపుతున్న క్షణాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి విషయంపై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇతర రాష్ట్రాల్లో ఒక్క రోజే.. హైదరాబాద్‌లో మాత్రం నెలల తరబడి! నిర్మాతలకు ఇదేం కష్టం?

అయితే ఈ ఆసక్తిని కొందరు ఆకతాయిలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఏఐ సాయంతో సెలబ్రిటీలకు సంబంధించిన తప్పుడు వీడియోలు తయారు చేసి నిజమైన వార్తల మాదిరిగా ప్రచారం చేస్తున్నారు. సమంతకు కవల పిల్లలు పుట్టారంటూ వచ్చిన వీడియో కూడా అలాంటిదే. ఈ విషయంలో సమంత స్వయంగా స్పందించడంతో అసలు విషయం బయటపడింది. ఇలాంటి వీడియోలను చూసి నిజమని నమ్మి ఇతరులకు షేర్ చేయకూడదనే విషయాన్ని కూడా ఈ ఘటన గుర్తుచేస్తోంది.

ఇక సమంత, రాజ్ నిడిమోరు దంపతులు తమ జీవితంలోకి రాబోతున్న కొత్త అతిథి కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌లో సమంతకు డెలివరీ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తన ప్రెగ్నెన్సీ సమయాన్ని ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. మరి సమంత నుంచి అసలైన గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చవచ్చు:

ఇట‌లీ నుంచి నేరుగా పెళ్లి మండ‌పంలోకి.. ప్ర‌భాస్ ఏం చేయ‌బోతున్నారు.?

రెండో పెళ్లి చేసుకునే అమ్మాయిలే టార్గెట్.. వరస హత్యల వెనుక అస‌లు కథ ఏమిటంటే.?

 

 

[Samantha Ruth Prabhu, Samantha Twins News, Samantha Pregnancy News, Samantha AI Fake Video, Samantha Responds to Twins Rumours, Samantha Not Yet Ammamma, Samantha Baby Bump, Samantha Raj Nidimoru, Samantha Viral Video, Tollywood Latest News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com