Home

»

Latest News

ప్రియా భవానీ శంకర్ పెళ్ళి: పదేళ్ళ ప్రేమ కథ.. నాలుగేళ్ళ క్రితమే కొత్త ఇల్లు.!

Nov 11, 2026 1:39PM

తమిళ నటి ప్రియా భవానీ శంకర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు రాజ్‌వేల్ రాజ్‌తో ఆమె వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట నిరాడంబరంగా వివాహ వేడుకను జరుపుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రియా భవానీ శంకర్, రాజ్‌వేల్ రాజ్‌లకు కాలేజీ రోజుల నుంచే పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పదేళ్లకు పైగా కొనసాగింది. వీరిద్దరూ తమ బంధం గురించి గతంలోనూ పలుమార్లు మాట్లాడారు. అంతేకాదు.. 2022లోనే కలిసి ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశారు. అప్పట్లోనే వీరి పెళ్లిపై వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఎట్టకేలకు తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నారు. సినీ ప్రముఖుల హంగామా, భారీ ఆర్భాటాలకు దూరంగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం జరగడం విశేషం. 

ప్రియా భవానీ శంకర్ మొదట న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత టెలివిజన్ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో వచ్చిన ‘మేయాద మాన్’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ‘డిమాంటీ కాలనీ’, ‘మాన్‌స్టర్’, ‘తిరుచిత్రంబలం’, ‘ఇండియన్ 2’ వంటి సినిమాలతో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఇది కూడా చదవండి: ‘జైలర్ 2’ ఓటీటీ వెర్షన్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.!

తెలుగులో ‘కల్యాణం కమనీయం’, ‘జీబ్రా’ చిత్రాలతో పాటు ఇటీవల రవితేజ సరసన ‘ఇరుముడి’లోనూ నటించారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

మొత్తానికి పదేళ్లకు పైగా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుని ప్రియా భవానీ శంకర్ తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ అందమైన జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మీకు నచ్చవచ్చు: 
30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.?
‘మాతృభూమి’ ట్రైలర్.. తెలంగాణ రియల్ హీరో బయోపిక్‌లో సల్మాన్ ఖాన్.!

 

 

 

[Priya Bhavani Shankar Wedding, Priya Bhavani Shankar Marriage, Priya Bhavani Shankar Husband, Priya Bhavani Shankar Latest, Irumudi Actress, Priya Bhavani Shankar, Rajvel Raj, Telugu Film News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com