
లోక నాయకుడు కమల్ హాసన్ నుంచి సినిమా వస్తుంటే ఎంత క్యూరియాసిటీ ఉంటుందో తెలిసిందే.ఈ విషయంలో అభిమానులు ఎవరో, ప్రేక్షకులు ఎవరో తెలుసుకోలేని పరిస్థితి. అంతలా సుదీర్ఘ కాలం నుంచి సెల్యులాయిడ్ ని శాసిస్తూ వస్తున్నాడు. అలాంటి కమల్ హాసన్ తాజా చిత్రం ‘సండియర్’
చిత్రబృందం కమల్ పుట్టినరోజు సందర్భంగా(నవంబర్ 7 ) ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్ తో పాటు 'ప్రతీకారం రక్తంతోనే తీరుతుంది' అనే సంభాషణ కూడా రిలీజ్ చేసారు. అయితే టైటిల్ అనౌన్స్ చేసిన క్షణం నుంచే తమిళనాడు రాజకీయ వర్గాల్లో మరియు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం చెలరేగింది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో శాంతిభద్రతలకు ఈ పేరు విఘాతం కలిగిస్తుందని, ఇది కుల ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని 'పుతియా తమిళగం పార్టీ' తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
విడుదలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కె. కృష్ణస్వామి డిమాండ్ చేయడంతో పాటు పోలీసులను ఆశ్రయించారు. సినిమా టైటిల్‌లో ఉన్న రెచ్చగొట్టే సంభాషణలు హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని రాజకీయ నేతలు మండిపడుతున్నారు. అయితే, ఈ వివాదం వెనుక దాదాపు 23 సంవత్సరాల చరిత్ర ఉంది. సరిగ్గా ఇదే టైటిల్‌ను గతంలోనూ కమల్‌హాసన్ ఒక సినిమా కోసం అనుకున్నారు. 2003-2004 కాలంలో కమల్ హీరోగా తెరకెక్కిన సినిమాకి మొదట ‘సండియర్’ అనే పేరునే పెట్టాలని భావించారు. కానీ అప్పట్లోనూ ఇదే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది.

అప్పట్లో డాక్టర్ కె. కృష్ణస్వామి మరియు పలు సంఘాల నుంచి వచ్చిన తీవ్ర నిరసనల కారణంగా ఈ వివాదం అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత వరకు వెళ్ళింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్పందించడంతో, చిత్రబృందం ఆ టైటిల్‌ను మార్చక తప్పలేదు. అలా ఆ సినిమా పేరును ‘విరుమాండి’గా మార్చి 2004 జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఎలాంటి టైటిల్ వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించి అప్పట్లో భారీ విజయంగా నిలిచింది.
ఇది కూడా చదవండి: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా:ఇయర్ ఎండ్ లో థియేటర్లని షేక్ చేయనున్న చిత్రాలు ఇవే!
ఇప్పుడు రెండు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా, మళ్లీ అదే పాత టైటిల్‌ను కమల్‌హాసన్ తన కొత్త ప్రాజెక్ట్ కోసం తెరపైకి తేవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి కూడా అదే పేరును పునరుద్ధరించడంపై రాజకీయ నాయకులు, పలువురు సినీ దర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొద్దిమంది దర్శకులు ఇలాంటి పాత వివాదాస్పద పేర్లు మళ్లీ కుల అహంకారాన్ని, హింసా సంస్కృతిని ప్రోత్సహిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం కళను కళలా చూడాలని వాదిస్తున్నారు.

రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు టర్మరిక్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌కు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సునీల్ కె.ఎస్. సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వివాదాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పూర్తిస్థాయిలో షూటింగ్ జరుపుకొని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతోంది. అరుణ్‌కుమార్ దర్శకుడు.
మీకు నచ్చవచ్చు:సినిమాపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం!
మీకు నచ్చవచ్చ:సూర్య కొత్త మూవీ భయ్యా: అదిరిపోయే జోనర్!
[Kamal Haasan sandiyar Controversy, Kamal Haasan, Sandiyar movie controversy, Kamal Haasan new film, Virumaandi title issue,Telugucinema news, TeluguCinema, Tollywood, Tollywood News]





