Venna Vundalu (Krishnashtami Special Recipe)
వెన్న ఉండలు - క్రిష్ణాష్టమి స్పెషల్
కావలసిన పదార్ధాలు..
* వెన్నపూస - 1 కప్పు
* వరిపిండి - 1 కప్పు
* ఉప్పు - చిటికెడు
* ఇంగువ - చిటికెడు
* వాము - కొద్దిగా
* నువ్వులు - 1 స్పూన్
తయారు చేసే విధానం:
* ముందుగా పొడి (లేదా) తడి వరి పిండిలో... ఉప్పు, ఇంగువ, వాము, నువ్వులు కలిపి.. అందులో తాజా వెన్న (లేదా) వైట్ బటర్ వేసి పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి.
* అనంతరం ఆ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని ... ఆ ఉండల్ని కాగే నూనెలో వేసి స్టవ్ పై మంట తగ్గించి దోరగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని .... వెన్న ఉండలు క్షణంలో తయారవుతాయి.