Vegetable Sambar
వెజిటేబుల్ సాంబార్
కావలసినవి:
కందిపప్పు - 2 కప్పులు
ముల్లంగి - ఒకటి
మునక్కడ - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
సాంబార్ పొడి -1 స్పూన్
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - సరిపడ
చింతపండురసం - అర కప్పు
పసుపు - అర స్పూన్
నూనె - తగినంత
తాలింపు దినుసులు
వంకాయలు - రెండు
బెండకాయలు - ఐదు
దోసకాయ - ఒకటి
టమాటో - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
తయారీ:
ముందుగా కూరగయలని కడిగి పొడవుగా కట్ చేసుకుని కందిపప్పును కలిపి కుక్కర్ లో వేసి ఉడికించుకోవాలి.
తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత పోపుగింజలు వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గాక చింతపండు రసం, ఉడికించిన కూరగయ ముక్కలు, పసుపు, ఉప్పు, సరిపడ కారం కూడా చేర్చి ఈ మిశ్రమాన్ని ముందుగా ఉడికించిన పప్పులో కలిపి తగినన్ని నీళ్ళు పోసి మరగనివ్వాలి.
ఇప్పుడు సాంబార్ పొడి వేసి రెండు నిముషాలు మరిగించాలి. పక్క స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి తాలింపు దినులుసు వేసి పోపు పెట్టుకుని చివరిలో కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.