Tomato Pulao Recipe

 

టమాటో పలావు

 

 

కావలసినవి:

బాస్మతీ బియ్యం - నాలుగు కప్పులు

టమాటాలు - ఆరు

ఉల్లిపాయ - ఒకటి

పుదీనా  - కొద్దిగా

పచ్చిమిర్చి - నాలుగు

అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్

నూనె - తగినంత

నెయ్యి - టేబుల్ స్పూన్

ఏలకులు - మూడు

లవంగాలు - కొద్దిగా

దాల్చినచెక్క - చిన్నముక్క

షాజీరా-  టీ స్పూన్

ఉప్పు - తగినంత

 

తయారుచేసే విధానం:

ముందుగా బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. ఇప్పుడు టమాటాలు చిన్న ముక్కలుగా తరిగి, మెత్తగా రుబ్బుకోవాలి. ఒక పాన్‌లో నూనె, నెయ్యి కలిపి వేడిచేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి వేగిన తరువాత పుదీనా, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి, కొద్దిగా వేపి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా కూడా వేసి మరి కొద్దిసేపు వేయించాలి. టమాటా ముద్దలో బియ్యానికి సరిపడా నీళ్లు కలుపుకుని ఈ పోపులో పోయాలి. అదే నీళ్లలో తగినంత ఉప్పు వేయాలి. టమాటా నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్లలో నానిన బియ్యం వడగట్టివేసి ఉడికించాలి. బియ్యంఉడికి, నీరంతా ఇరిగిపోయాక మంట పూర్తిగా తగ్గించి, నిదానంగా మరో ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. ఈ పలావుని  పిల్లలకు లంచ్ బాక్స్‌లో, ప్రయాణాలలో పులిహోరకు బదులుగా చేసుకుని తీసుకెళ్లొచ్చు.