Summer Chicken Salad
సమ్మర్ చికెన్ సలాడ్
కావలసిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్ - వంద గ్రామలు
ఉల్లిపాయ - ఒకటి
కీరా - ఒకటి
టొమాటో - ఒకటి
క్యాప్సికమ్ ముక్కలు - పావుకప్పు
నిమ్మరసం - అరచెంచా
తేనె - ఒక చెంచా
పల్లీల పొడి - రెండు చెంచాలు
మిరియాల పొడి - అరచెంచా
ఉప్పు - చిటికెడు
తయారీ విధానం:
చికెన్ ను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటిని నీటిలో వేసి స్టౌ మీద పెట్టాలి. సాఫ్ట్ గా అయ్యేవరకూ ఉడికించి దించేసి, నీళ్లు ఒంపేసి ఆరబెట్టాలి. ఉల్లిపాయ, కీరా, టొమాలోలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఓ బౌల్ లో మొత్తం పదార్థాలన్నిటినీ వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే కొంచెం పెరుగు చేర్చుకున్నా బాగుంటుంది. వేసవి దాహార్తికి ఇది చెక్ పెడుతుంది. కోల్పోయిన శక్తిని తిరిగి తెస్తుంది.
- Sameera