Mixed Fruit Lassi
మిక్స్‌డ్ ఫ్రూట్ లస్సీ
కావలసిన పదార్థాలు:
యాపిల్ - ఒకటి
అరటిపండు - ఒకటి
పుచ్చకాయ ముక్కలు - ఒక కప్పు
ఖర్చూజా ముక్కలు - అరకప్పు
సీడ్ లెస్ నల్లద్రాక్షలు - పావుకప్పు
పెరుగు - ఒకటిన్నర కప్పులు
చక్కెర - మూడు చెంచాలు
ఐస్ వాటర్ - ఒక కప్పు
యాలకుల పొడి - చిటికెడు
తయారీ విధానం:
పెరుగులో మీగడ లేకుండా చూసుకోవాలి. అన్ని పండ్లనూ కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆపైన పెరుగు కూడా వేసి మరోసారి మిక్సీ పట్టాలి. చివరగా చక్కెర, ఐస్ వాటర్ కూడా వేసి బాగా బ్లెండ్ చేయాలి. మరీ చిక్కగా అనిపిస్తే ఇంకాసిన్ని నీళ్లు చేర్చుకోవాలి. తరువాత ఈ లస్సీని గ్లాసుల్లో పోసి, యాలకుల పొడి చల్లి సేవించాలి.
- sameera