Stuffed aloo Recipe
స్టఫ్ట్ ఆలూ రెసిపి
కావలసిన పదార్ధాలు:
ఆలు గడ్డలు: అర కేజీ
ఉల్లిపాయలు: 1
కాప్సికమ్ : 1
బఠాణీలు : 1 స్పూన్
పచ్చి మిర్చి : 2
టొమాటోలు: 4
కాలీఫ్లవర్ పూలు:1 పెద్దది
వెల్లుల్లి : 2
ఉప్పు : తగినంత
నెయ్యి : 1/4 కప్పు
కొత్తిమీర : కొద్దిగా
తయారు చేసే విధానం:
ఆలుగడ్డలను పైన ఒక ఇంచ్ లేయర్ వరకు తీసేయ్యాలి. తర్వాత మిగిలిన భాగం మధ్యలో జాగ్రత్తగా చిన్న గుంట ఏర్పాటు చెయ్యాలి.
ఇప్పుడు గిన్నె తీసుకుని అందులో కాసిన నీళ్ళు పోసి ఉప్పు కాలీఫ్లవర్, ఉల్లిపాయ, పచ్చి మిర్చి,కాప్సికమ్, బఠాణీలు,వేసి నీళ్ళు ఇగిరి పోయేదాకా ఉడికించాలి .
ఈ మిశ్రమాన్ని ముందు చేసి రెడీ పెట్టుకున్న ఆలూ మద్యలో పెట్టాలి . ఇంతకముందు కట్ చేసి పెట్టుకున్న లేయర్ ని విడిపోకుండా స్టఫ్ట్ ఆలూ మీద పెట్టాలి విడిపోకుండా ఉండడానికి ఒక టూత్ పిక్ ను గుచ్చాలి.
ఒక గిన్నె తీసుకుని నెయ్యి పోసి వేడి చేసి అందులో టొమాటో ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు ఉడకపెట్టాలి.
ఆలుగడ్డలను ఈ టమాటా మిశ్రమంలోకి జాగ్రత్తగా వేసి,మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి. కొత్తిమీరతో చల్లితే స్టఫ్ట్ ఆలూ రెడీ