special laddu recipe
స్పెషల్ లడ్డు
కావలసిన పదార్థాలు:
పాలపొడి - 200 గ్రాములు
కండెన్స్‌డ్ మిల్క్ - 250 గ్రాములు
నెయ్యి - 100 గ్రాములు
కొబ్బరి తురుము - కప్పు
బెల్లం - 250 గ్రాములు
బాదం- సరిపడా
జీడిపప్పు - 10
కిస్‌మిస్ - 15
తయారి విధానం:
ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నెపెట్టి బెల్లం తురుము, కొబ్బరి వేసి కలుపుతూ ఉండాలి. మిశ్రమం గట్టిపడ్డాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి పక్కన పెట్టాలి.
తరువాత ఒక గిన్నెలో పాల పొడి, కరిగించిన నెయ్యి, కండెన్స్‌డ్ మిల్క్ వేసి కలిపి, స్టవ్ మీద పెట్టి కోవా మిశ్రమం ల అయ్యేవరకు కలపాలి.
ఇప్పుడు ముందుగా చేసిపెట్టుకున్న కొబ్బరి మిశ్రమం చిన్న ఉండలుగా చేసుకుని కోవా కూడా ఉండలుగా చేసుకుని కోవా మిశ్రమం లో కొబ్బరి ఉండలు పెట్టుకుని కనిపించకుండా కవర్ చేయ్యాలి,. అంతే టేస్టీ లడ్డు రెడీ.
