షీర్ కుర్మా (రంజాన్ స్పెషల్)
షీర్ కుర్మా
(రంజాన్ స్పెషల్)
కావలసినవి :
పాలు - 1 లీటర్
సన్నని సేమ్యా - 1/2 కప్పు (వేయించినది)
పంచదార - కప్పు
నెయ్యి - సరిపడా
యాలకుల పొడి - 1.స్పూన్
బాదాం - 1/4 కప్పు
పిస్తా - 1/4 కప్పు
జీడిపప్పు - 1/4 కప్పు
ఎండుద్రాక్ష - 1/2 కప్పు
నానపెట్టిన ఖర్జూరం ముక్కలు - 1/2 కప్పు
సారపప్పు, కర్బూజా గింజలు - 1/4 కప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు
కండెన్స్డ్ మిల్క్ - 1/4 కప్పు
తయారీ విధానం :
ముందుగా రెండు చెంచాల వేడి పాలల్లో కుంకుమ పువ్వు వేసి నాననివ్వాలి.
ప్యాన్‌లో నెయ్యి వేడి చేసి బాదాం, పిస్తా, జీడిపప్పు, ఎండుద్రాక్ష, సారపప్పు, కర్బూజా గింజలు, నానపెట్టిన ఖర్జూరం ముక్కలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
మిగిలిన నేతిలో సేమ్యా వేయించుకోవాలి.
మరో ప్యాన్‌లో పాలు మరిగించాలి. అవి ఒక పొంగు వచ్చాక పంచదార వేసి కలపాలి. అది కరిగిన తర్వాత వేయించిన పలుకులు, ఖర్జూరం, సేమ్యా, యాలకుల పొడి వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
తర్వాత కుంకుమ పువ్వు, కండెన్స్డ్ మిల్క్ పోసి కలిపి దింపేయాలి.