Read more!

Senagapappu Gongura Recipe

 

 

 

శనగపప్పు గోంగూర రెసిపి

 

 

 

కావలసిన పదార్థాలు:

<గోంగూర - 6 కట్టలు

మెంతి పొడి - 1 స్పూన్‌

మినపప్పు - ఒక స్పూన్

జీలకర్ర - 1 టీ స్పూన్‌

ఆవాలు - 1 టీస్పూన్‌

పచ్చి శెనగపప్పు - 100 గ్రాములు

నూనె : 3 స్పూన్స్

ఉప్పు : ఒక స్పూన్

కారం - సరిపడా

ఉల్లిపాయలు - 1

పచ్చిమిర్చి - 3

ఎండుమిర్చి - 2

పసుపు - పావు టీ స్పూన్‌

ఇంగువ - పావు టీ స్పూన్‌

వెల్లుల్లిపాయలు - ఐదు

 

తయారు చేసే విధానం:

ముందుగా గోంగూరను శుభ్రం చేసుకోవాలి. శనగపప్పు విడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

స్టౌవ్ పై గిన్నె పెట్టి అందులో నూనె వేసి ,వెల్లుల్లి, జీల కర్ర, ఆవాలు, మినప్పప్పు,పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించాలి.

ఆవాలు వేగిన తర్వా త ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత గోంగూర వేసి నీళ్ళు పోసి కొద్దిసేపు ఉడికించాలి.

గోంగూర బాగా ఉడికిన తర్వాత ముం దుగా ఉడికించి పెట్టుకున్న శెనగపప్పు వేసి తర్వాత ఉప్పు, కారం వేసి మరో కొద్ది నిమిషాలు ఉడికించుకోవాలి.