Semya Laddu

 

 


సేమ్యా లడ్డూ

 

 

 

సాధారణంగా సేమ్యాతో పాయసం చేసుకుంటాం. కానీ ఈసారి వెరైటీగా వాటితో లడ్డూలు ఏలా చేస్తారో ఓ లుక్కేద్దాం

కావాలసిన పదార్ధాలు

* సేమియా
* 1/2 తురిమిన కొబ్బరి
* కప్పు మైదాపిండి
* కప్పు తెల్ల నువ్వులు
* 2 కప్పుల చెక్కర
* కప్పు బాదం, కిస్మిస్, జీడిపప్పు

తయారీ విధానం..

* ముందుగా ఒక బాణలి తీసుకొని అందులో నెయ్యి వేసి సేమియా వేయించుకోవాలి. ఆ తరువాత తెల్లనువ్వులు, కొబ్బరి, బీట్రూట్, కిస్మిస్, జీడిపప్పు, బాదం వేసి వేయించుకోవాలి. అవి చల్లారిన తరువాత వాటిని మిక్సీ వేసి పొడి చేసుకోవాలి.

* ఆ తరువాత చక్కెరను పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని సేమియా, మైదా మిశ్రమంలో కలపాలి.

* ఇప్పుడు ఈ మిశ్రమంలో కొబ్బరి పొడి కూడా వేసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. అంతే రుచికరమైన సేమ్యా లడ్డూలు రెడీ.