Sapota And Akhrot Kheer Recipe
అక్రూట్ ఖీర్ & సపోటా కీర్ రెసిపి
కావలసిన పదార్ధాలు:
సపోటాలు: 4
పాలు: అర లీటర్
పంచదార: పావు కేజీ
అక్రూట్లు : అరకప్పు
దంపుడు బియ్యం: అరకప్పు
తయారు చేసే విధానం:
ముందుగా బియ్యని రెండు గంటల ముందు నానాబెట్టుకోవాలి.
తరువాత స్టవ్ వెలిగించి నానబెట్టిన బియ్యాన్ని గిన్నెలోకి తీసుకొని అందులో పాలు పోసి చిన్న మంట మీద ఉడకనివ్వాలి.
అన్నం ఉడికేటప్పుడు గిన్నెకు అంటుకోకుండా తిప్పాలి.
పాలల్లో బియ్యం మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
తర్వాత అందులో పంచదార వేయ్యాలి.
ఇప్పుడు అక్రూట్ల ను వేయించుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మిశ్రమంలో వేసి కలపాలి.
కీర్ చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసుకుని మిశ్రమం చల్లబడిన తర్వాత సపోటాలను మెత్తగా చేసుకొని అందులో కలపాలి.
అంతే అక్రూట్ & సపోట కీర్ రెడి.