Saggu Biyyam Halwa & Spring Onion Pakodi
సగ్గు బియ్యం హల్వా
తయారు చేసే విధానం :
ముందుగా సగ్గు బియ్యాన్ని కడిగి 3 గంటల సేపు నానబెట్టాలి. ఆ తరవాత ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి . ఆ తరవాత మరో గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో సగ్గు బియ్యం వేసి నీళ్ళు పోసి ఉడకబెట్టాలి . అందులోని నీరు ఇంకేవరకు ఉండలవకుండా కలుపుతూ ఉండాలి. అలా ఉడికిన సగ్గుబియ్యం లో చెక్కెర కలపి అది కరిగి చిక్కబడేవరకు కలుపుతూ ఉండాలి. చిక్కబడ్డాక, నెయ్యి, జీడి పప్పు, ఎందు ద్రాక్ష, యాలకుల పొడి వేసి కాసేపు ఉడకనిచ్చి దించేస్తే సరి సగ్గుబియ్యం హల్వా రెడీ. దీనిని జీడిపప్పు, ఎండు ద్రాక్ష తో గార్నిష్ చేసుకుంటే చాలా బావుంటుంది.
ఉల్లికాడల పకోడీ
తయారు చేసే విధానం :
ముందుగా బాణలిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి, ఆ లోపు పకోడీ చేయడానికి కావలసిన మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. అందుకు ఒక కప్పు శనగ పిండిలో రెండు స్పూన్ ల బియ్యపు పిండి, ఉల్లికాడ తరుగు, కారం, ఉప్పు, పసుపు, జిలకర , కాస్తంత వేడి నూనె , అల్లం పచ్చిమిర్చి పేస్ట్ , బాగా కలిపి కాస్తంత నీటిని కూడా కలిపి చిన్న చిన్న ముద్దల్లా వేస్తూ, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే ఉల్లికాడల పకోడీ రెడీ.