Read more!

Sabudana Vada Recipe

 

 

 

సగ్గుబియ్యం వడలు

 

 

 

 

కావలసినవి:
సగ్గుబియ్యం - పావుకేజీ 
బంగాళాదుంపలు - మూడు
పచ్చిమిర్చి - ఆరు
కొత్తిమీర - ఒక కట్ట
కరివేపాకు - రెండు రెబ్బలు
జీలకర్ర - ఒక చెంచా
వేరుశనగ పప్పు - రెండు కప్పులు 
ఉప్పు, నూనె - తగినంత

 

తయారుచేసే విధానం: 
ముందుగా సగ్గుబియ్యం రెండు గంటల సేపు నానబెట్టాలి. తర్వాత బంగాళా దుంపలు ఉడకబెట్టి పై పొర ఒలిచేయాలి. ఇప్పుడు  ఉడికిన బంగాళాదుంపలను మెత్తటి ముద్దలాచేసి పక్కన పెట్టుకోవాలి. వేరుశనగపప్పు వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి . పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. సగ్గుబియ్యం బాగా నానిన తర్వాత నీళ్లు ఏమైనా మిగిలితే తీసెయ్యాలి. ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో ఇందాక మనం ముద్ద చేసిపెట్టుకున్న బంగాళాదుంపల మిశ్రమాన్ని కలపాలి. అలాగే వేరుశనగపప్పు పొడిని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర మరియు ఉప్పు వేసి అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాణాలిని పెట్టుకొని అందులో తగినంత నూనె పోసి కాగనివ్వాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని సగ్గుబియ్యం మిశ్రమాన్ని  వడలాగా వత్తుకోవాలి. ఆ వడని కాగుతున్న నూనెలోవేసి దోరగా వేయించుకోవాలి. ఎంతో రుచిగా కరకరలాడే సగ్గుబియ్యం వడలు రెడీ.