Read more!

Rakhi Special

 

 

 

రాఖీ స్పెషల్

 

మలై కాజా

 

 

కావలసినవి :

పనీర్ తురుము - అరకేజీ
పాల మీగడ - 100 గ్రాములు
జామూన్ మిక్స్ - 200  గ్రాములు
పంచదార - కేజీ
నూనె - సరిపడా
మైదా - 100 గ్రాములు
యాలకుల పొడి - ఆఫ్ స్పూన్

 

తయారీ :
ముందుగా పనీర్ తురుములో మైదా, పాలమీగడ, జామూన్ మిక్స్, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. ఈ పిండిని అరగంట పాటు నానపెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పంచదారలో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత పిండిని చిన్నచిన్న ముద్దలు తీసుకుని కాజాలు చేసుకుని నూనెలో దొరగా వేయించుకోవాలి. ఇప్పుడు  వీటిని పంచదార పాకంలో వేసి రెండు  నిమిషాల పాటు నాననివ్వాలి. తరువాత వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.

 

 

 డ్రై ఫ్రూట్ బర్ఫీ

 

 

 

కావలసినవి:

పాలు -  లీటర్
పంచదార - 200  గ్రాములు
నెయ్యి - 100  గ్రాములు
ఏలకుల పొడి - టీ స్పూన్
రోజ్ వాటర్ - 15 ఎం.ఎల్
బాదంపప్పు, జీడిపప్పు , కిస్‌మిస్, వాల్‌నట్స్ , పిస్తాపప్పు - అన్నింటిని పావు కప్పు చొప్పున తీసుకోవాలి.

 

తయారీ :
ముందుగా పాలను స్టవ్ మీద  పెట్టి మరిగించి, అందులో పంచదార కలిపి మిశ్రమం చిక్కబడే వరకు  కలపాలి.తరువాత నెయ్యి, ఏలకుల పొడి వేసి తర్వాత రోజ్ వాటర్, కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పలుకులు కలపాలి ఒక పది నిముషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్‌కి నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని వేసి, పల్చగా పరవాలి. ఆరిన తర్వాత కావలసిన షేప్‌లో కట్ చేసుకుని పైన కిస్‌మిస్, పిస్తాపప్పు పలుకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి