Rajma Masala Recipe
రాజ్‌మా మసాలా కర్రీ రెసిపి
కావలసిన పదార్థాలు :
రాజ్‌మా. 150 గ్రాములు
కొత్తిమీర: సరిపడా
ఉల్లిపాయలు. 2
టొమోటో. 3
ధనియాలపొడి. 1 స్పూన్
గరంమసాలా. 1/2 స్పూన్
నూనె. 3 స్పున్లు.
కారం. 1/2 స్పూన్.
అల్లం వెల్లుల్లి. 1 స్పూన్
పచ్చిమిర్చి. 2
తయారీ విధానం:
రాజ్‌మాను ముందు రోజు రాత్రి నానబెట్టిట్టుకోవాలి.
తరువాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి కాగాక పచ్చిమిర్చి ముక్కలను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచం సేపు ఆగి కాసేపటి తరువాత ఉల్లిపాయ, టొమోటో ముక్కలను వేసుకుని కలపాలి .
తరువాత రాజ్‌మా ను కుక్కర్ లో వేసి బాగా ఉడికించాలి. ఇప్పుడు వేగుతున్న మిశ్రమంలో ఉడికించిన రాజ్‌మా, ధనియాలపొడి,గరంమసాలాలను వేసి,కారం వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
కర్రీ చిక్కబడ్డాక చివరిలో కొత్తిమిర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి