Rajasthani Avakaya

 

 
రాజస్థానీ ఆవకాయ


కావలసిన పదార్థాలు:- 

మామిడికాయలు - మూడు
ఆవాలు - ఒక చెంచా
మెంతులు - అరచెంచా
సోంపు - అరచెంచా
కారం - అరకప్పు
ఉప్పు - అరకప్పు
పసుపు - పావుకప్పు
నూనె - ఒక కప్పు


తయారీ విధానం:-

మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేయాలి. వీటికి ఉప్పు, సగం పసుపు కలిపి ఓ సీసాలో వేసి మూత పెట్టాలి. పది గంటలకో సారి మూత తీసి, ముక్కల్ని బాగా కలిపి మళ్లీ మూత పెట్టేయాలి. రెండు రోజుల పాటు ఇలా చేయాలి. మూడో రోజుకు ముక్కల్లో నీరు ఊరుతుంది. చిల్లుల గిన్నెలో ముక్కలు వేసి నీరంతా ఓడిపోయేదాకా ఉంచాలి. ఆ తరువాత ఓ బట్టమీద ముక్కల్ని ఆరబెట్టాలి. ఆ తరువాత ముక్కల్ని ఓ బౌల్ లో వేసి, మిగతా పదార్థాలతో పాటు సగం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్నమాన్ని గాజు సీసాలో కానీ జాడీలో కానీ వేసి, మిగతా నూనె పోసి మూత గట్టిగా పెట్టేయాలి. పదిహేను ఇరవై రోజుల తర్వాత తీసి వాడుకోవచు.

 - Sameera