Pesara Pappu Pongali Recipe

 

 

పెసరపప్పు పొంగలి

 

 

కావలసిన పదార్థాలు:

బియ్యం - 1cup

పెసరపప్పు - 1cup

బెల్లం - 2cup

నీళ్ళు - 4.5cups

జీడిపప్పు - 10

కిస్‌మిస్‌ - 10

ఎండుకొబ్బరి ముక్కలు - 1/2cup

ఏలకుల పొడి - 1/2tsp

నెయ్యి - 1/2cup


తయారు చేయు విధానం:

ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో నెయ్యి మొత్తాన్ని వేసుకోవాలి. ఎండుకొబ్బరి ముక్కలను కొంచెం ఎర్రగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకుని దానిలోనే జీడిపప్పు, కిస్‌మిస్‌ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి నాలుగున్నర కప్పుల నీరు పోసి స్టౌ మీద పెట్టుకోవాలి. దానిని అన్నం వండినట్లుగానే ఉడికించుకుంటూ (అన్నం మొత్తం పలుకు లేకుండా ఉడకాలి. అన్నం మొత్తం ఉడికిన తరువాత ఎసరు లేకపోతే కొంచెం నీరు పోసుకోవచ్చు) కొంచెం నీరు ఉన్నప్పుడే దానిలో బెల్లం తురుము వేసి కరిగేదాకా మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్‌తో పాటుగా నెయ్యి వేసి బాగా కలిపాలి. అంతే.. ఎంతో రుచికరమైన స్వీట్‌ పెసర పప్పు పొంగలి రెడీ.