Pav Burger

 



పావ్ బర్గర్

 

 

పావ్ బాజీ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా... ఆ బ్రెడ్‌తో పిల్లలు ఇష్టపడేలా చాలా ప్రయోగాలూ చేయచ్చు. అలాంటి ఓ వెరైటీ ఈ రోజు చెప్పుకుందాం. ఈ స్నాక్  పిల్లలతో చేయించండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు... ఎందుకంటే వాళ్ళు ఇష్టపడే సాస్‌లు వాడతాం కాబట్టి.

కావలసినవి:

పావ్ బాజీ బ్రెడ్ - 6 పీసులు
టమాటో సాస్ - 6 చెమ్చాలు       
చిల్లీ సాస్ - ఒక చెమ్చా
కాబేజీ - చిన్న కప్పుతో
కాప్సికం - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
టమాటో - ఒకటి
బటర్ - 6 చెమ్చాలు
మిరియాల పొడి  - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం: 

పావ్ బాజీ బ్రెడ్‌ని మధ్యకి కోసి, బటర్‌తో కాల్చుకోవాలి. పావ్ బాజీ చేసినప్పుడు ఎలా కాలుస్తామో అలా. అలా కాల్చిన బ్రెడ్స్ అన్నిటినీ ఒక ప్లేట్‌లో పెట్టండి. ఇక కూరగాయలు రెడీ చేసుకుందాం. కాబేజీ, కాప్సికం, ఉల్లిపాయ, టమాటోలని సన్నగా పొడవుగా కట్ చేయాలి. ఒక బాణిలో కొంచం బటర్ వేసి ముందు ఉల్లిపాయ, ఆ తర్వాత కాప్సికం, అది కాస్త వేగాక కాబేజీ, ఆఖరులో టమాటో వేసి కొంచెం ఫ్రై చేయాలి. కూరలు మరీ మెత్తపడకూడదు. దించేముందు చిటికెడు ఉప్పు, మిరియాల పొడి వేయాలి. ఇప్పుడు ముందుగా కాల్చి పెట్టుకున్న బ్రేడ్స్ మీద, బట్టర్ స్ప్రెడ్ చేసి, ఆ పైన రెండు సాస్‌లని కొంచం  కొంచం వేసి రాయాలి. మీద వేయించిన కూరలని పెట్టి, ఒక బ్రెడ్‌ని మరో బ్రెడ్‌తో మూయాలి. అంటే బుజ్జి బర్గర్‌లా వస్తుంది అప్పుడు. పిల్లలు తినటానికి వీలుగా చిన్నగా వుంటుంది. రుచి పిజ్జాలా వుంటుంది... చూడటానికి బర్గర్‌లా వుంటుంది... అమ్మకేమో పిల్లలకి అన్ని కూరగాయలూతినిపించే ఛాన్స్. సో ఈ స్నాక్ ఐటమ్ మీ పిల్లలకి తప్పక చేసి పెట్టటానికి ఇంకేం కావాలి చెప్పండి.

-రమ

 

 

Recommended for you