Paneer Tikka Sandwich

 

 

పనీర్ టిక్కా సాండ్ విచ్

 

కావలసిన పదార్ధాలు..

పనీర్                         -   200 గ్రాములు

కాప్సికమ్                  -  ఒకటి

బ్రెడ్                           -  నాలుగు పీస్ లు

లెట్యూస్ లీఫ్స్            - సరిపడా

స్టఫ్ కోసం..

పెరుగు -                     -  1/2 కప్పు

కారం                          - 1/2 స్పూన్

ఛాట్ మసాలా              -  1/2 స్పూన్

ఉప్పు                          -  తగినంత

గరంమసాలా               - 1/2 స్పూన్

ధనియాల పొడి            - 1/2 స్పూన్

జీలకర్ర పొడి                - 1/2 స్పూన్

వెల్లుల్లి పేస్ట్                 -  1 స్పూన్

తయారీ విధానం..

* ముందుగా  పనీర్.. క్యాప్సికమ్ ను చిన్న ముక్కలుగా చేసుకొని అందులో పెరుగు, ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్టే వేసి బాగా కలుపుకోవాలి.

* ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం నూనె వేసి అది హీట్ అయిన తరువాత.. అందులో పైన చేసిన మిశ్రమం వేసి పనీర్ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకూ.. ప్లస్ డ్రై అయ్యే వరకూ ఉంచాలి. ఇప్పుడు దీనిపై జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.

* ఇప్పుడు బ్రెడ్ పీస్ లు తీసుకొని వాటిని బటర్ పూసి.. వాటి మధ్యలో లెట్యూస్ లీఫ్స్... పైన తయారు చేసిన స్టఫ్ పెట్టి.. ఒవెన్ లో ఉంచి అవి రోస్ట్ అయిన తరువాత బయటకు తీసి ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి. అంతే టేస్టీ పనీర్ టిక్కా సాండ్ విచ్ రెడీ అయినట్టే.

 

..రమ