పనీర్ భుర్జీ

 

 

పనీర్ భుర్జీ

 

కావాల్సిన పదార్థాలు:

పనీర్ - 250గ్రాములు

పచ్చి బఠానీలు - అరకప్పు

ఉల్లిపాయలు -సన్నగా తరిగినవి రెండు

టమోటాలు- పావు కప్పు

సన్నగా తరిగినవి క్యాప్సికమ్ - అరకప్పు

నూనె- 1 లేదా 2 టేబుల్ స్పూన్స్

అల్లం -అర అంగుళం సన్నగా తరిగినది

పచ్చిమిర్చి - 1 సన్నగా తరిగింది.

పసుపు- చిటికెడు

కారం పొడి- పావు టీస్పూన్

ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:

పనీర్ భుర్జీ తయారు చేయడానికి ముందుగా ఒక బాణాలిలో నూనే పోసి, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు వాటన్నింటిని బాగా కలపాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు వేసి మరోసారి బాగా కలపాలి. దీని తర్వాత క్యాప్సికమ్, పచ్చిబఠాణీలు వేయాలి. మూతపెట్టి మగ్గనివ్వాలి. అన్నీ ఉడికిన తర్వాత అందులో తురిమిన పనీర్ వేసి కలిపాలి. ఇప్పుడు కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసి కాసేపు వేయించాలి. అంతే సింపుల్ పనీర్ బుర్జీ సిద్ధం. కావాలనుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇది రోటీలో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.