Paneer Chaat
పన్నీర్ చాట్
కావలసినవి :
పన్నీర్ ముక్కలు - 2 కప్పులు
ఉడికించిన బఠాణీలు - కప్పు
ఆలూ - రెండు
కారప్పూస - అర కప్పు
కొత్తిమీర - టేబుల్ స్పూన్
నిమ్మరసం - కొద్దిగా
నూనె - సరిపడా
పచ్చిమిర్చి తురుము - టీస్పూన్
మిరియాల పొడి - అరటీస్పూన్
ఉప్పు - తగినంత
అల్లం తురుము - టీస్పూన్
ఆమ్ చూర్ - 2 టీస్పూన్లు
తయారీ :
ముందుగా బఠాణీలు , ఆలూ విడి విడిగా ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి కాగాక పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము వేసి వేయించాలి. తరువాత పన్నీర్ ముక్కలు, ఉడికించిన ఆలూ ముక్కలు, బఠాణీలు వేసి వేయించాలి. ఇప్పుడు ఆమ్ చూర్, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర, కాస్త కారప్పూస వేసి సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి.