పన్నీర్ భుజియ
పన్నీర్ భుజియ
పన్నీరు తో ఏ వంటకం చేసినా పిల్లలు ఇష్టం గా తింటారు. పన్నీరు తో తొందరగా చేయగలిగే బుజియ గురించి ఈ రోజు చెప్పుకుందాం
కావలసిన పదార్దాలు ...
పన్నీరు ....250 గ్రాములు
ఉల్లిపాయలు .. రెండు
టమాట.....ఒకటి
జీలకర్ర....అర చెమ్చా
పచ్చి మిర్చి రెండు
అల్లం , వెల్లుల్లి పేస్టు ..పావు చెమ్చా
ధనియాల పొడి ..పావు చెమ్చా
జీలకర్ర పొడి ....చిటికెడు పొడి
కారం ...పావు చెమ్చా
ఉప్పు ..రుచికి తగినంత
పసుపు ..చిటికెడు
తయారీ విధానం;-
ముందుగా బాణలి లో నెయ్యి వేసి , కొంచం కాగ గానే జీలకర్ర వేయాలి.ఆ వెంటనే పచ్చిమిర్చి , అల్లం వెల్లులి పేస్టూ వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లి పాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యేవరకు వేయించాలి. అప్పుడు టమాట ముక్కలని కూడా వేసి చిటికెడు పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసి బాగా కలపాలి. టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేస్తే త్వరగా మెత్త పడతాయి. చివరిగా పన్నీరు వేయాలి. అప్పడే సరిపడా ఉప్పు , కారం కూడా వేసి కలపాలి. పన్నీరు వేసాక ఎక్కువ సేపు స్టవ్ మీద ఉంచకూడదు . ఓ రెండు నిముషాలు బాగా కలిపి దింపేయాలి. ఈ కూర చపాతీ లోకి, అలాగే బ్రెడ్ టోస్ట్ కి కూడా బావుంటుంది.
టిప్స్ :-
1. ఈ బుజియ చేయటానికి ఉల్లిపాయ, టమాట లని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే అవి పన్నీరు తో పాటు కలిసి మంచి రుచి వస్తుంది.
2. పన్నీరు ని చేతితో బాగా మెదిపితే చాలు ...పొడి పొడి గా వచ్చేస్తుంది. కోరితే అంత బావుండదు.
3. కావాలంటే పన్నీరు భజియాలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు.
4. ఈ పన్నీరు కూరని చపాతీ లో పెట్టి రోల్ చేసి పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.
- రమ