Paneer 65 Recipe
పన్నీర్ 65
కావలసిన పదార్ధాలు :
పన్నీర్ ముక్కలు -1 కప్పు
కార్న్ ఫ్లోర్ - 1 కప్
కారం - సరిపడా
కొత్తిమీర - ఒక కట్ట
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - సరిపడా
మైదా - అర కప్పు
ధనియాల పొడి - 2 స్పూన్స్
అమ్ చూర్ పొడి - 2 స్పూన్స్
తయారుచేయువిధానం :
* ముందుగా పన్నీరు ముక్కలు వేడి నీళ్ళల్లో 5 నిమిషాలు ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
* తరువాత ఒక బౌల్ తీసుకుని మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, ధనియాలపొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, గరం మసాల వేసి నీళ్ళు పోసి బజ్జి పిండిలా కలపాలి.
* స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పోసి కాగాక కలిపి ఉంచుకున్న పిండిలో పన్నీర్ ముక్కలు ముంచి డీప్ ఫ్రాయ్ చెయ్యాలి.
* ఇలా అన్నింటిని వేయించుకుని ప్లేట్ లోకి తీసుకుని పైన అమ్ చూర్ ,సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లి టమాట సాసు తో సర్వ్ చేసుకోవాలి.