Palathalikalu & Bobbatlu
పాల తాళికలు
తయారు చేసే విధానం :
గిన్నెలో నెయ్యి వేసి కాగాక, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలి, ఆ తరవాత ఇంకో గిన్నె తీసుకుని వేడి చేయాలి , ఆ నీరు మరిగేటప్పుడు అందులో నీరు పోసి అందులో తాళికల్ని వేసి ఉడకబెట్టాలి. అవి ఉడికాక అందులోనే చెక్కెర వేసి అది కరిగే వరకు ఉడకనిచ్చి నీరు ఇంకాక అందులో తగినన్ని పాలు పోసి ఉడకనిచ్చి యాలకుల పౌడర్ వేసి దించేసి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేయాలి.
బొబ్బట్లు
తయారు చేసే విధానం :
ముందుగా స్టవ్ పై పెనం పెట్టాలి, అది వేడయ్యే లోపు తడిపిన గోధుమ పిండిలోంచి కొద్ది కొద్దిగా గోధుమ పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తరవాత శనగపప్పు మిశ్రమాన్ని గోధుమ పిండి మధ్యలో పెట్టి ఉండలా చుట్టి, చపాతీలా చేసుకోవాలి. ఆ తరవాత ప్యాన్ పై కొద్దిగా నెయ్యి వేసి చపాతీలా చేసుకున్న గోధుమపిండి, శనగపప్పు మిశ్రమాన్ని రెండు వైపులా కాల్చుకుని నెయ్యి వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే బొబ్బట్లు రెడీ.