Onion Tomato Masala Gravy Curry

 

 

 

టమాటో ఉల్లిపాయ మసాలా గ్రేవీ కర్రీ

 

 

 

టమాటాల సీజన్లో టమాటాతో బోల్డన్ని వెరైటీలు చేసుకుంటేనే గొప్ప ఆనందంగా ఉంటుంది. మాములుగా టమాటా ఉల్లిపాయ పోపులో వేసికుని కాస్త మసాలా పౌడర్ వేసుకునే  కర్రీ మనకి తెలిసిందే. మరి వాటితోనే హోటల్ లో చేసే కర్రీ లాంటిది మనం ఇంట్లోనే తయారు చేసుకుంటేనో,ఇంకా హ్యాపీ గా ఉంటుంది కదూ.

 

కావాల్సిన పదార్థాలు:

సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 3
టమాటాలు - 4
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - 1/2 స్పూన్
ఆవాలు - 1/2 స్పూన్
ఉప్పు - తగినంత
మసాలాకి కావాల్సినవి:

గసగసాలు - 1 స్పూన్
ధనియాలు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
ఎండుమిర్చి - 6-7
కొబ్బరి తురుము - 2 స్పూన్స్
పుట్నాల పొడి - 2 స్పూన్స్
కొత్తిమీర - తగినంత
గరం మసాలా - 1/4 స్పూన్

 

తయారి విధానం:

ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టి నూనె వేసి అందులో గసగసాలు వేయాలి. అవి వేగాక ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి. అదే నూనెలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. స్టవ్ ఆపి అవి చల్లారాకా వాటిలో పుట్నాలు, కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కాస్త నీళ్ళు పోసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

మళ్లీ కడాయి లో నూనె వేసి ఆవాలు వేసి వేగాకా అల్లం ముక్కలు వేయాలి. ఒక 3 నిమిషాల తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి రంగు వచ్చే దాకా వేగనివ్వాలి.  దానిలో ఉడికించి తొక్కు తీసి మెత్తగా ప్యూరి లా చేసుకున్న టమాటా ముద్దవేసి ఉడకనీయాలి. అందులో ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ముద్దని, గరం మసాలాని వేసి 6-7 నిమిషాలు మగ్గనివ్వాలి. కర్రీ తయ్యారయ్యకా  గార్నిష్ కోసం కొత్తిమీరని వాడచ్చు.

 

 ...కళ్యాణి