Onion Peanut Chutney Recipe
ఉల్లి పల్లీల చట్నీ
పిల్లలకి సాధారణంగా పల్లీల చట్నీ బాగా ఇష్టంగా వుంటుంది. అయితే రోజూ అచ్చంగా పల్లీలతోనే చట్నీ బదులు ఈ వెరైటీ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. పిల్లకి తేడా తెలియదు. ఆరోగ్యం కూడా.
కావలసినవి:
ఉల్లిపాయలు - 2
పల్లీలు - ఓ చిన్న కప్పు
నువ్వులు - రెండు చెమ్చాలు
పోపు సామాను, పసుపు, నూనె - తగినంత
కరివేపాకు - 6
ఎండుమిర్చి - 6
పచ్చిమిర్చి - 2
కొబ్బరి - చిన్న ముక్క
తయారీవిధానం:-
ముందుగా రెండు చెమ్చాల నూనె వేసి పోపుగింజలు.. అంటే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగుతుండగానే అందులో పల్లీలని కూడా వేయాలి. పల్లీలు కొంచెం వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, నువ్వులు కలిపి మరికాసేపు వేయించాలి. పోపు బాగా వేగాక పక్కన ప్లేటులో ఒంపుకుని అదే మూకుడులో పొడవుగా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. ఇప్పుడు ముందుగా పోపుని రుబ్బి, ఆ తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సూపర్‌గా వుంటుంది. పిల్లలకి పల్లీ రుచి, అతిథులకి కొత్త రుచి అందుతాయి. ఇల్లాలికి ఫుల్ మార్కులు పడతాయి. ట్రై చేసి చూడండి ఈ ఉల్లి, పల్లీల పచ్చడిని.
-రమ