Read more!

Oats Special Recipes

 

 

 

ఓట్స్ స్పెషల్ రెసిపిస్

 

 

 

ఓట్స్ లడ్డు రెసిపి

 

 

 

కావలసినవి :
ఓట్స్‌ - 250 గ్రాములు
నెయ్యి- 50 గ్రాములు,
ఇలాచిపొడి - 1/2 టీస్పూన్‌
చక్కెర - 2 చిన్న కప్పులు,
శెనగపపప్పు- 250 గ్రాములు

 

తయారు చేసే విధానం:
ముందుగా  స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా  నెయ్యి వేసి  ఓట్స్‌ వేసి వేయించుకోవాలి. మిక్సీ లో వేసి మెత్తగా పౌడర్ లా  చేసుకోవాలి. శెనగపప్పు కూడా  పొడి చేసుకోవాలి. పంచదార కూడా పొడి చేసుకోవాలి. ఒక పెద్ద బౌల్‌ తీసుకొని అందులో ఓట్స్ పౌడర్,శనగపప్పు పొడి,పంచదారా పొడి, ఇలాచి    వేసి బాగా కలిపి అందులో కరిగించిన నెయ్యి వేసి, మళ్ళి కలుపుకుని లడ్డు లా మనకి కావాల్సిన సైజులో చేసుకోవాలి....

 

ఓట్స్ బిస్కెట్స్‌ రెసిపి

 

 

 

కావలసినవి :
ఓట్స్‌- 100గ్రాములు,
రాగి పిండి- 50గ్రాములు,
వాము - కొద్దిగా,
చక్కెర - 2 టేబుల్‌ స్పన్‌,
ఉప్పు - 1/2 టీస్పూన్‌
వెన్న - 1 టీస్పూన్‌

 

తయారుచేసే విధానం:
ముందుగా ఓట్స్‌ లో కాస్త్త వెన్న వేసి వేయించి పొడి చేసుకుని, అందులో  వాము,రాగి పిండి, ఉప్పు, చక్కెర వేసి కాస్తనీరు  చపాతి లాగా కలిపి ఒక  పది నిముషాలు పక్కన పెట్టుకుని, పిండిని తీసుకుని ఉండలు  చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని,వాటిని  కావలసిన షేప్ లో కట్ చేసుకుని ట్రే లో పెట్టుకుని  ఓవెన్లో 15ని పాటు 45 డిగ్రీల వద్ద బేక్‌ చేయ్యాలి . అంతే బిస్కట్స్ రెడి... 

 

ఓట్స్ హల్వా రెసిపి

 

 

 

కావలసినవి :
ఓట్స్‌ - పావు కేజీ
సాఫ్రాన్‌ కలర్‌ - చిటికడు,
పాలు - కొద్దిగా
చక్కెర - 250 గ్రాములు
నెయ్యి-50గ్రాములు,
జీడిపప్పు - సరిపడా
పచ్చికొబ్బరి  - 100 గ్రాములు

 

తయారు చేసే విధానం:
ముందుగా  ఓట్స్ ని ఫ్రీ చేసుకుని పౌడర్  చేసుకోవాలి, స్టవ్‌ వెలిగించి పాన్  లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు,  ద్రాక్ష వేయించి న పెట్టుకుని, తరువాత  చక్కెర ,నీరు వేసి పాకం లేతగా రాగానే కొబ్బరి , ఓట్స్‌ పొడి వేసి కలపాలి. పాలల్లో  కలర్  వేసి కలుపుకోవాలి.ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలి.మిశ్రమం బాగా ఉడికి నెయ్యి ప్యాకి తేలిన తరువాత ఎండు ద్రాక్ష,జీడిపప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.