Oats Coconut Laddoo

 

 

 

ఓట్స్ కొబ్బరి లడ్డూ

 

 

కావలసిన పదార్థాలు: 

ఓట్స్                                             - 1 కప్పు

బెల్లం                                            - 1 కప్పు

పచ్చికొబ్బరి తురుము                      - 1 కప్పు

నెయ్యి                                          - 2 చెంచాలు

యాలకుల పొడి                              -  చిటికెడు

జీడిపప్పు, బాదం, పిస్తా                    - కావలసినన్ని

 

తయారీ విధానం:

ముందుగా ఓట్స్ ను దోరగా వేయించి, మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లా చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో కొబ్బరి, బెల్లం వేసి స్టౌ మీద పెట్టాలి. బెల్లం కరిగాక కొబ్బరితో కలిసి చిక్కగా అయ్యాక ఓట్స్ పౌడర్ వేసి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక యాలకుల పొడి, జీడిపప్పు, బాదం, పిస్తా వేసి బాగా కలపాలి. లడ్డూలు చుట్టడానికి వీలయ్యే వరకూ మిశ్రమాన్ని ఉడికించి, చెంచాడు నెయ్యి వేసి కలిపి దించేయాలి. చేతికి నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని లడ్డూలు చుట్టుకోవాలి.

 

- sameeranj