Read more!

Mysore Dosa Recipe

 

 

 

మైసూరు దోస రెసిపి

 

 

 

కావలసిన పదార్థాలు:

కొతిమీర తురుము -కొద్దిగా

నూనే- సరిపడా

ఉప్పు-కొద్దిగా

బియ్యం -3 కప్పులు

మినపప్పు - 1 కప్పు

శనగపప్పు -3 స్పూన్

పుట్నాల పొడి -కొద్దిగా

కొబ్బరి తురుము -కప్పు

 

దోస మసాలా కోసం:

కరివేపాకు - కొద్దిగా

కొబ్బరి తురుము - అరకప్పు

ఆవాలు - ఒకస్పూన్

బంగాళా దుంపలు - పావు కేజీ

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమీర్చి - 3

నిమ్మరసం - 3 స్పూన్

పసుపు - కొద్దిగా

ఉప్పు- కొద్దిగా

 

తయారీ విధానం :

బియ్యం,మినపప్పు ,శనగపప్పు ,ఈ మూడింటిని కలిపి  నానపెట్టుకోవాలి .పూర్తిగా నానిపోయాక  రాత్రి దోసలా పిండిలా రుబ్బి పెట్టుకోవాలి .

తరువాత మసాలా తయారుచేసుకోవాలి బంగాళాదుంపలను ఉడికించి పొట్టు తీసిమైతగా చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్  వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి  అందులో పసుపు ,పచ్చిమిర్చి కరేపాకు ,ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్  వచ్చాక ఆలూ  మిశ్రమం,ఉప్పు కొతిమీర,నిమ్మరసం కలిపి కొంచం సేపు ఉడికించాలి .

ఇప్పుడు  దోసల పిండిలో  సాల్ట్ కలిపి దోస వేసుకుని చుట్టూ  ఆయిల్ వేసి  రెండు నిముషాలు అయ్యాక అందులో ఆలూ కూర, కొబ్బరి, క్యారెట్ తురుము వేసి దోసను  సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.