Mutton Roast
మటన్ రోస్ట్
కావలసినవి:
మటన్ - అర కేజీ
నిమ్మరసం - టీ స్పూన్
పసుపు - టీ స్పూన్
ఉప్పు - తగినంత
చాట్ మసాలా - టీ స్పూన్
నూనె - సరిపడినంత
కారం - టీ స్పూన్
ఉల్లిపాయలు - రెండు
మిరియాల పొడి - ఒక స్పూన్
తయారి:
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి మటన్ ముక్కలను వేయించి పక్కన పెట్టి అందులోనే ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. అవి వేగాకా పసుపు, కారం, ఉప్పు, వేయించుకున్నమటన్ ముక్కలు వేసి కలుపుకుని పైన చాట్‌మసాలా, మిరియాల పొడి వేసుకుని కొద్దిసేపు వేయించుకుని నిమ్మరసం వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.