Strawberry Phirni
స్ట్రాబెర్రీ ఫిర్నీ
కావలసిన పదార్థాలు
బాస్మతీ బియ్యం - ఐదు చెంచాలు
పాలు - మూడున్నర కప్పులు
చక్కెర - ఒక ప్పు
స్ట్రాబెర్రీస్ - పది
యాలకుల పొడి - అరచెంచా
సన్నగా తరిగిన పిస్తా - నాలుగు చెంచాలు
తయారీ విధానం
స్ట్రాబెర్రీస్ ని శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తని ప్యూరీలా చేసుకోవాలి. బియ్యాన్ని అరగంటసేపు నానబెట్టాలి. ఆ తరువాత అరకప్పు పాలతో కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న పాలు, చక్కెర వేసి స్టౌమీద పెట్టాలి. సగానికి సగం అయ్యేవరకూ మరిగించాలి. తరువాత బియ్యం పేస్ట్ ను వేసి మెల్లగా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. పదిహేను నిమిషాల పాటు ఉడికించాక స్ట్రాబెర్రీ ప్యూరీ వేసి కలపాలి. మిశ్రమం చిక్కగా అయ్యి గిన్నెకు అంటుకుంటున్నప్పుడు పిస్తా పప్పు వేసి కలిపి, యాలకుల పొడి చల్లి దించేసుకోవాలి. దీన్ని కాసేపు ఫ్రిజ్ లో ఉంచి చల్లచల్లగా సర్వ్ చేయాలి.
- Sameera