Miryala Charu

 

 

మిరియాల చారు

కావాల్సిన పదార్ధాలు:

మిరియాలు - ఒక టేబుల్ స్పూన్

వెల్లుల్లి - 12 రెబ్బలు

జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్

చింతపండు పులుసు - 600 ml

టొమాటో ముక్కలు - ఒక కప్పు

నూనె - ఒక టేబుల్ స్పూన్

పసుపు - పావు టేబుల్ స్పూన్

ఎండు మిర్చి - మూడు

ఆవాలు - ఒక టేబుల్ స్పూన్

కరివేపాకు - నాలుగు రెబ్బలు

కొత్తిమీర తరుగు - కొద్దిగా

ఉప్పు - తగినంత

ఇంగువ - చిటికెడు

తయారీ విధానం:

* మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర రోట్లో వేసి బరకగా దంచుకోవాలి.

* కళాయిలో నూనె వేసి అందులో ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేపుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు మగ్గించాలి.

* మగ్గిన టొమాటోలో చింతపండు పులుసు, దంచుకున్న మిరియాల మిశ్రమం, ఉప్పు, కరివేపాకు కొత్తిమీరా,వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆపేసి దింపేసుకోవాలి.

* ఈ మిరియాల చారు అన్నం, ఇడ్లీలలోకి చాలా బాగుంటుంది.