Meal Maker Pulao Recipe

 

 

మీల్‌మేకర్‌ పులావ్‌  రెసిపి

 

కావలసిన వస్తువులు:

మీల్‌మేకర్‌ - 250 గ్రాములు

బాస్మతి బియ్యం - 300 గ్రాములు

నెయ్యి - 100 గ్రాములు

ఉప్పు - ఒక టేబుల్‌ స్పూన్‌

దాల్చిన చెక్క - ఒక ముక్క

అల్లం - 25 గ్రాములు

వెల్లుల్లి రెబ్బలు - 25 గ్రాములు

యాలకులు - 3

లవంగాలు -12

బిర్యానీ ఆకులు -2

పుదీనా- 1 కట్ట

కొత్తిమీర - 1 కట్ట

పచ్చిమిర్చీ -5

పచ్చి బఠాణీ - ఒక కప్

ఆలు - 1

ఉల్లిపాయ - ఒకటి

 

తయారు చేసే విధానం:

ముందుగా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చి బఠాణీ, మీల్‌మేకర విడిగా ఉడికించాలి.

ఇప్పుడు స్టవ్‌ వెలిగించుకుని చిన్న కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి కొద్దిగా వేడి చేయాలి. , దాల్చిన చెక్క,ఇలాచి,సగం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి.

తర్వాత ఉల్లితరుగు, కొత్తిమీర, పుదీనా,బిర్యానీ ఆకులు వేసి వేయించాలి.

ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠాణీ , ఆలు ముక్కలు, మీల్ మేకర్ వేసి వేయించి సరిపడా నీళ్ళుపోసి ఉప్పు వేసి కడిగిన బియ్యం వేసి 2 విజిల్స్‌ వచ్చే వరకు ఉంచాలి.