Matar Paneer
మటర్ పనీర్
కావలసిన పదార్ధాలు:
బఠాణీలు - కప్పు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
క్రీమ్ - 4టీ స్పూన్లు
పనీరు - 200 గ్రాములు
టొమాటోలు - నాలుగు
పంచదార - టీస్పూను
కారం - 2 టీస్పూన్లు
గరం మసాలా - టీస్పూను
చింతపండు గుజ్జు - 4 టీస్పూన్లు
పచ్చిమిర్చి - ఆరు
దనియాల పొడి - టీస్పూను
జీలకర్ర - టీస్పూను
పసుపు - చిటికెడు
అల్లంతురుము - టీస్పూను
కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు
వెన్న - కొద్దిగా
తయారుచేసే విధానం:
* ఓ గిన్నెలో కాసిని నీళ్ళు పోసి పనీర్ ముక్కలు, కాస్త ఉప్పు, కొంచం పసుపు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
* బఠాణీలు కూడా ఉడికించి ఉంచాలి.
* బాణలిలో కొద్దిగా నూనె వేసి అల్లం తురుము, చితపండు గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి.
* విడిగా మరో బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, పసుపు, దనియాల పొడి వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగానే వేయించిన చింతపండు, టొమాటో గుజ్జు మిశ్రమం వేసి కలపాలి. తరువాత క్రీమ్, చెక్కర, ఉప్పు వేసి కలిపి సన్నని మంటమీద వేగనివ్వాలి. తరువాత ఉడికించిన పనీరు ముక్కలు, బఠాణీలు వేసి కలిపి కాసేపు ఉడికించాలి అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము, వెన్న వేసి దించాలి.