Read more!

Masala Dosa Recipe

 

 

 

మసాల దోశ

 

 

 

కావలసిన పదార్థాలు:

మినపప్పు: 2cups

శెనగ పప్పు: 2cups

బియ్యం: 1cup

ఉప్పు: రుచికి తగినంత

ఎండు మిర్చి: 8-10

పసుపు: 1/4tsp

ఇంగువ: చిటికెడు

వెల్లుల్లి: 2

కారం: 1tsp

బంగాళ దుంపలు: 1/2kg

ఉడికించిన బఠాణీలు: 1/2cup

పచ్చి మిర్చి: 4-6

అల్లం: చిన్న ముక్క

ఆవాలు: 1/2tsp

మినపప్పు: 1tsp

శనగపప్పు: 1tsp

కరివేపాకు: రెండు రెమ్మలు

నూనె: తగినంత

కొబ్బరి చట్నీ: 1cup

టమోటో: 2

క్యాప్సికమ్: 2

 

తయారు చేయు విధానం:

1. ముందుగా బియ్యం, పప్పులు విడివిడిగా కనీసం ఆరుగంటలు నాన బెట్టి తరువాత మెత్తగా రుబ్బి తగినంత ఉప్పు ఎండు మిరపకాయలు కలిపి మళ్లీ రుబ్బుకోవాలి.

2. తర్వాత పిండిని బాగా కలియ బెట్టి గరిటజారుగా చేసుకుని 5-8 గంటలపాటు అలాగే ఉంచాలి.

3. అంతలోపు బంగాళదుంప బజ్జీ రెడీ చేసుకవాలి. అందుకు పాన్ లో నూనె వేడి చేసి పోపుదినుసులన్నీ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులోనే కరివేపాకు పచ్చిమిర్చి చిటికెడు ఇంగువ వేసి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి.

4. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బఠాణీలు, పసుపు, అల్లం తురుము వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఉడికించి పొట్టు తీసి చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపను, కారం మరియు ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.

5. తర్వాత వేడి పెనంపై కొంచెం నూనె వేసి దోసె పోసి దానికి పైన చట్నీ రాసి, టమోటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కులు దోసె మొత్తం పరవాలి. తర్వాతా దోసె మధ్యలో తగినంత బంగాళదుంప బజ్జీని పెట్టి కొద్దిగా దోరగా కాల్చి వేడి వేడి గా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయాలి.