Read more!

Dosa Special Recipes

 

 

 

మనసు దోచే దోసెలు...!

 

 

 

రవ్వ దోసె

 

కావాల్సిన పదార్థాలు :-
* గోధుమరవ్వ - 250 గ్రాములు
* బియ్యంపిండి - 50 గ్రాములు
* పచ్చిమిరపకాయలు - 3 లేక 4 (సన్నగా తరిగినవి)
* జీలకర్ర - ఒక చిన్న చెంచాడు
* తాజా కొబ్బరి - సన్నగా తరిగిన ముక్కలు అరకప్పు
* పులిసిన మజ్జిగ - రెండు కప్పులు
* ఉప్పు - తగినంత
* నూనె - అవసరాన్ని బట్టి.

 

తయారుచేసే పద్ధతి :-
* గోధుమరవ్వ, బియ్యప్పిండి, కొబ్బరితురుము, మిరపకాయలు మజ్జిగతోపాటు కలుపుతూ పిండి గట్టిగా వుండే విధంగా తయారుచేయాలి.
* పది - పదిహేను నిమిషాలవరకు బాగా కలియబెట్టాలి. జీలకర్ర, ఉప్పు పిండిలో కలిపి మూడు, నాలుగు గంటల పాటు కదిలించకుండా ఉంచాలి.
* అప్పుడు వేడిచేసిన పెన్నంపై ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ, నూనెపోస్తూ దోసెలు తయారుచేయాలి.
* రవ్వదోసెను కొబ్బరిపచ్చడితో వేడివేడిగా వడ్డిస్తే చాలా రుచిగా వుంటుంది.

 

*********

 

సెట్ దోసె

 

 

కావాల్సిన పదార్థాలు :-
* మినప్పప్పు - ఒక కప్పు
* బియ్యపు పిండి - మూడున్నర కప్పులు
* అటుకులు - అరకప్పు
* ఉప్పు - తగినంత
* తయారైన దోసెను జీడిపప్పు పిస్తా, కరివేపాకుతో అలంకరించాలి.

 

తయారు చేసే పద్ధతి :-
* మినప్పప్పు, అటుకులు కలిపి ఒక గిన్నెలో నాలుగు లేక అయిదు గంటలపాటు నానబెట్టాలి.
* ఆ తరువాత పలచగా రుబ్బి, దానికి బియ్యపుపిండి, ఉప్పు కలిపి నీళ్ళు పోసి కలపాలి. అప్పుడు దోసేలకు అనువైన పిండి తయారవుతుంది. దానితో చిన్న పరిమాణం గల దోసెలు మూడింటిని ఒకసారి వేయవచ్చు.
* ఒకే విడతలో 3 లేక 4 తయారయ్యే ఈ 'సెట్ దోసె'లను పైన చెప్పిన విధంగా అలంకరించి వడ్డించవచ్చు.

 

***********

 

పేపర్ దోసె

 

 

కావాల్సిన పదార్థాలు :-
* బియ్యం - 4 కప్పులు
* శుభ్రంగా కడిగి మినప్పప్పు - అరకప్పు
* ఉప్పు - తగినంత
* జీలకర్ర - చిన్న చెంచాడు
* నూనె - అవసరానికి తగినంత.

 

తయారు చేసే పద్ధతి :-
* మినప్పప్పు, బియ్యాన్ని వేరు వేరుగా సుమారు ఆరు గంటలు పాటు నానబెట్టాలి. తరువాత విడివిడిగానే నీరు పోస్తూ పలుచగా అయ్యేలా రుబ్బాలి.
* రుబ్బే సమయంలో మధ్యమధ్యన కొద్దిగా కదిలించడం వాళ్ళ బుడగలుపోతాయి. నీరు ఎక్కువ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. పప్పు, బియ్యం మిశ్రమాలను రెండింటినీ కలిపి ఉప్పువేసి రాత్రంగా వుంచాలి.
* జీలకర్రను ముద్దగా చేసి రాత్రంతా నానిన మిశ్రమానికి కలిపి పేపర్ ళా పలుచగా ఉండేలా దోసెలను, వేడిచేసిన పెన్నంపై తయారుచేసుకోవచ్చు.
* దోసెకు రెండువైపులా నూనెవేసి సన్నని సెగపై వేయించి, దీనిని వేడివేడిగా సాంబారుతో వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది.

 

****************

 

బనానా దోసె

 

కావాల్సిన పదార్థాలు :-
* బియ్యం - 4 కప్పులు
* కొబ్బరి -  1 కప్పు
* మగ్గిన అరటిపండ్లు 2 లేక 3
* ఉప్పు తగినంత.

 

తయారు చేసే పద్ధతి :-
* బియ్యాన్ని రాత్రంతా నాననిచ్చి, తక్కున సామాగ్రి అంతా వేసి బాగా రుబ్బాలి. నీటిని పోస్తూ గరిటె జారుగా ఉండేలా పిండిని తయారుచేయాలి.
* దానితో దోసెలు తయారుచేసి ఆకుకూర పచ్చడితో సర్వ్ చేస్తే బాగుంటుంది.