Masala Beerakaya Kura
మసాలా బీరకాయ
కావలసిన పదార్ధాలు:-
బీరకాయ - 1 kg
కారం - తగినంత
ఉల్లిపాయలు - 4
నూనె - 10 స్పూన్లు
లవంగాలు - 3
పచ్చిబఠాణీలు - 250 స్పూన్లు
ధనియాలు - 2 స్పూన్లు
వెల్లులి - 8 రేకులు
అల్లం - చిన్న ముక్క
యాలక్కాయలు - 4
తయారుచేసే విధానం:-
బీరకాయలు చెక్కు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, పొడిగా చేసి ఉంచుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి బాగా కాగిన తరువాత ఉల్లిపాయలు, బీరకాయలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి వేసి అవసరమైనంత నీరు పోయాలి. కొంచెం సేపు ఉడికిన తరువాత ధనియాలు, యాలుకాయలు, లవంగాలు, పొడిని దానిపై జల్లాలి. కొత్తిమీర తరిగి ఈ కూర పై జల్లి దించుకోవాలి.