Mango Kulfi
మ్యాంగో కుల్ఫీ
కావలసిన పదార్థాలు:
పాలు - రెండున్నర కప్పులు
మామిడిపళ్లు - నాలుగు
చక్కెర - అరకప్పు
యాలకుల పొడి - అరచెంచా
పిస్తా పప్పులు - పదిహేను
జీడిపప్పు పేస్ట్ - ఒక చెంచా
బియ్యప్పిండి - మూడు చెంచాలు
కుంకుమపువ్వు - చిటికెడు
తయారీ విధానం:
మామిడిపండ్ల తొక్క తీసేసి, మెత్తని పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి. బియ్యప్పిండిలో కొద్దిగా పాలు పోసి చిక్కగా కలిపి పెట్టుకోవాలి. పిస్తాపప్పుల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. పాలలో కుంకుమపువ్వు వేసి స్టౌ మీద పెట్టాలి. పాలు కాగాక చక్కెర వేసి కరిగేవరకూ మరిగించాలి. తర్వాత బియ్యప్పిండి, జీడిపప్పు పేస్ట్ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. కొంచెం చిక్కగా అయ్యిన తర్వాత స్టౌ కట్టేసి పిస్తాపప్పు, మ్యాంగో ప్యూరీ వేసి కలిపి... యాలకుల పొడి చల్లి చల్లారబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్ లో వేసి ఫ్రీజర్ లో పెట్టి, గట్టిగా అయిన తర్వాత తీసి సర్వ్ చేయాలి.
- Sameera