Palak Fritters

 

 

 

 

పాలకూర ఫ్రిట్టర్స్

 

 

 

కావలసిన పదార్థాలు:

పాలకూర ఆకులు                         - పది
శనగపిండి                                    - అరకప్పు
బియ్యప్పిండి                                - రెండు చెంచాలు
కారం                                           - అరచెంచా
చాట్ మసాలా                               - అరచెంచా
వాము                                         - అరచెంచా
పసుపు                                       - చిటికెడు
ఉప్పు                                          - తగినంత
వంట సోడా                                   - చిటికెడు
నూనె                                           - వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

పాలకూర ఆకుల్ని ఉప్పు కలిపిన నీటితో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఓ బౌల్ లో నూనె తప్ప మిగతా పదార్థాలన్నిటికీ వేసి బాగా కలపాలి. దీనిలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చిక్కగా కలుపుకోవాలి. పాలకూర ఆకుల్ని ఈ మిశ్రమంలో ముంచి తీసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే నిమిషాల్లో వేడి వేడి పాలకూ ఫ్రిట్టర్స్ రెడీ. పిల్లలకు స్నాక్స్ అంటే తెగ ఇష్టం. అలాంటప్పుడు అంగట్లో ఏవి పడితే అవి కొనిపెట్టకుండా ఇంట్లోనే పాలకూ ఫ్రిట్టర్స్ లాంటివి తయారు చేసి పెట్టండి.

- Sameera