Mamidikaya Pappu

 

 

మామిడికాయ పప్పు

 

 

కావాల్సిన పదార్థాలు:-

పులుపులేని మామిడికాయ - ఒకటి

పెసరుపప్పు - 1/4 కప్పు

పచ్చిమిర్చి - 2

ఉప్పు - తగినంత

పసుపు - 1/2 స్పూన్

నూనె - తగినంత

ఆవాలు - 1/2 స్పూన్

కరివేపాకు - 5 లేదా 6

ఇంగువపొడి - తగినంత


తయారుచేసే పద్దతి:-

ముందుగా పెసరు పప్పును మాములుగా ఉడక పెట్టుకోవాలి. ఆ తరువాత మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పెసరు పప్పు మూడువంతులు ఉడికిన తరువాత ముక్కలుగా కట్ చేసిన మామిడికాయ ముక్కలను పప్పులో వేయాలి. రెండు ఉడికిన తరువాత తగినంతగా పసుపు, ఉప్పు వేసి దింపాలి. తరువాత ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువవేసి తాలింపు వేయాలి. వేడివేడిగా వడ్డిస్తే రుచి అమోఘంగా వుంటుంది.