Kalakand

 

 

కలాకండ్

 

కావాల్సిన పదార్ధాలు:

చిక్కటి పాలు - రెండు లీటర్స్

పంచదార - అర కప్పు

నిమ్మ ఉప్పు - చిటికెడు

నీళ్ళు - అర కప్పు

తయారీ విధానం:

* కచ్చితంగా అడుగు మందంగా లోతుగా ఉన్న మూకుడులో మాత్రమే 1/2 కప్ నీళ్ళు పోసి అందులో చిక్కటి పాలు పోసి కలుపుతూ పాలని మరగబెట్టాలి.

* పాలు పొంగువచ్చాక మరో 15-20 నిమిషాలు మరిగించాలి. అప్పుడు కాస్త చిక్కబడతాయ్. అప్పుడు పాలల్లో పంచదార వేసి కలుపుతూ హై-ఫ్లేం మీద మరగబెట్టాలి.

* పాలు సగం పైన చిక్కబడ్డాక ¼ కప్ నీళ్ళలో నిమ్మ ఉప్పు వేసి కలిపి కరిగించి పక్కన పెట్టుకోవాలి.

* ఇప్పుడు సగం పైగా మరిగిన పాలల్లో కొద్ది కొద్దిగా నిమ్మ ఉప్పు నీరు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి.

* పాలు విరిగేదాకా కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి.

* హై-ఫ్లేం మీద 50 నిమిషాలు కలిపాక పూసలు పూసలుగా కలాకండ్ దగ్గరపడుతుంది.

* అప్పుడు స్టవ్ ఆపేసి మూకుడు దింపి అంచులకి పలుచగా స్ప్రెడ్ చేసి 30 నిమిషాలు పూర్తిగా ఆరనివ్వాలి.

* ఆ తరువాత నెయ్యి రాసిన ట్రే లో కలాకండ్ వేసి స్ప్రెడ్ చేసి 4-5 గంటలు ఆరనివ్వాలి, అప్పుడే ముక్కలు కొయ్యడానికి వస్తుంది