Kakarakaya Kabab Recipe

 

 

 

కాకరకాయ కబాబ్ 

 

 

 

 

కావలసినవి:

కాకరకాయలు - నాలుగు

ఉల్లిపాయలు - మూడు

శనగపిండి - ఒక కప్పు

కారం - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

టమాటాలు - నాలుగు

ఉప్పు, నూనె - తగినంత

 

తయారుచేసే విధానం:

ముందుగా కాకరకాయల్ని చాకుతో పైన చదును చేసి, మధ్యలో చీల్చి లోపలున్న గింజల్ని, తెల్లని పొరను స్పూనుతో తీసివెయ్యాలి. తరువాత కాకరకాయ లోపల ఉప్పుతో బాగా రుద్దాలి. కాకరకాయలను నీళ్లలో ఉడకబెట్టి, నీళ్ళు వంచేసి, మంచినీళ్లలో రెండుసార్లు కడిగి పక్కన ఓ గిన్నెలో ఉంచాలి. ఇప్పుడు ఒక బాణలిలో కొంచెం నూనె పోసి కాగాక, తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసి, దానిలో శనగపిండిని కూడా వేసి పచ్చి వాసన పోయే వరకూ సన్నని సెగ మీద ఫ్రై చెయ్యాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపాక, టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా కలియబెడితే, కాకరకాయల్లో కూరడానికి మసాలా తయారవుతుంది. ఇప్పుడు ఈ మాసాలకు తగినంత ఉప్పు చేర్చి, ఉడికించి ఉంచిన కాకరకాయల్లో కూర్చి కాకరకాయ విడిపోకుండా దారంతో కట్టాలి. వీటిని అట్ల పెనం మీద నూనె పోసి ఎర్రగా కరకరలాడే వరకూ ఫ్రై చెయ్యాలి. అంతే కాకరకాయ కబాబ్ రెడీ.